గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇలాంటి క్రమంలో బుచ్చిబాబు సన్నా.. చరణ్ సినిమా కోసం చేస్తున్న ఓ ప్లాన్ పై.. ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈ సినిమాలో రామ్‌చరణ్ తల్లి రోల్ కోసం యంగ్ బ్యూటీ ని ఫిక్స్ చేయాలని భావించారట. ఆమె మరెవరో కాదు.. మలయాళ యాక్ట్రెస్ స్వాసిక. ఆమె తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకుంది.
నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమాలో చుట్ట కాలుస్తూ విలన్ రోల్‌లో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. పెద్ది సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన స్వాసిక పెద్ది సినిమాల్లో చరణ్ తల్లి రోల్ కోసం నన్ను అడిగితే.. నేను వద్దని చెప్పేశా. నిజంగా ఆఫర్ విని నాకు షాకింగ్ గా అనిపించినా.. చరణ్‌కు నేను తల్లి రోల్‌లో చేయకపోవడమే బెటర్ అని ఫిక్స్ అయ్యా. అందుకే నో చెప్పేసా. ఒకవేళ భవిష్యత్తులో చరణ్‌కు తల్లి పాత్ర చేయాల్సి వస్తే.. అప్పుడు ఆలోచిస్తా అంటూ స్వాసిక వివరించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది.
యంగ్ హీరోయిన్‌ను ఎలా ఫిక్స్ చేయాలనుకున్నారు అంటూ.. అప్పుడు గాని సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచేది అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా వయసు 40.. ఇక స్వాసికకు 33 ఏళ్లు. ఇంత ఏజ్ గ్యాప్ తో చరణ్ కంటే చిన్న పిల్లను తల్లి పాత్రలో చూపిస్తే అసలు ఎలా సింక్ అవుతుంది. బుచ్చిబాబు ఇలాంటి ప్లాన్ ఎలా వేసావ్ అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్. చరణ్ తల్లి రోల్లో నటించడానికి అంతకంటే పెద్ద వయసున్న సెలబ్రిటీస్ ఎంతోమంది ఉన్నారని.. ఆమని లాంటి వారు చరణ్ మదర్ రోల్‌కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.