కోలీవుడ్ థలైవర్ రజినీకాంత్ తాజాగా కూలీ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేశాడు రజనీకాంత్. అయినా ఆయన క్రెజ్ కేవలం ఓపెనింగ్‌కు మాత్రమే పనికొచ్చింది. లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులంతా రిలీజ్ కు ముందు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు. ఇక సినిమా రిలీజై ఫస్ట్ హాఫ్ బయటకు వచ్చిన తర్వాత.. సినిమాపై ఆడియన్స్‌లో మెల్లమెల్లగా ఆశక్తి తగ్గిపోతూ వచ్చింది. అయితే.. రజనీకి ఉన్న క్రేజ్ రీత్యా.. ఫస్ట్ డే ఓపెనింగ్స్ మాత్రం భారీగానే దక్కించుకుంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే భారీ వసుళ్లను కొల్లగొట్టింది.
ఇక సినిమా వీకెండేస్ లో రిలీజ్ అయిన క్రమంలో మొదటి నాలుగు రోజులు టాక్ తో సంబంధం లేకుండా డీసెంట్ వసూలు దక్కాయి. తర్వాత జోరు వానలు సినిమాపై ప్రభావాన్ని చూపించాయి. కూలీ వసూళ్ల వర్షానికి బ్రేక్ పడింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. కూలీ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లను కల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. సీనియర్ స్టార్ హీరో కి ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడం అంటే సాధారణ విషయం కాదు. సినిమాలో ఇతర హీరోల సైతం నటించినా.. రజనీకాంత్ వన్ మ్యాన్ షో నడిచింది. రజిని సినిమాతో స్క్రీన్ పై మాయ చేశాడు. కాగా.. సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.222 కోట్ల షేర్ మాత్రమే దక్కించుకుంది.
తెలుగులో రూ.46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగి కేవలం రూ.40 కోట్లు మాత్రమే దక్కించుకుంది. ఇంకా సినిమా హిట్ టాక్ రావాలన్నా మరో రూ.6 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఇప్పటికే తెలుగులో సినిమా కలెక్షన్లు పడిపోయాయి. ఇక ముందు ముందు కలెక్షన్లతో సినిమా కోల్పోవడం కూడా కష్టమే. కాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.305 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమాకు.. 307 కోట్ల బ్రేక్ఈవెన్ టార్గెట్ ఉంది. అయితే.. ఇప్పటివరకు కేవలం రూ.222 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. ఇంకా రూ.84 కోట్ల షేర్ వసూలు వస్తే కానీ సినిమా హిట్ లిస్టులోకి వెళ్ళదు. ఎంత శ్రమించినా మరో రూ.20 కోట్లు సినిమాకు వచ్చిన.. రూ.60 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉండిపోతుంది. అంటే బయ్యర్స్ కు భారీ నష్టమే మిగులుతుంది. కొనుగోలు చేసిన బయ్యర్లకు కనీసం కూలీ కూడా గిట్టుబాటు అయ్యేలా లేదంటు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.