బన్నీ కోసం అట్లీ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. దెబ్బకు వాళ్లందరి నోర్లు మూయాల్సిందే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్పతో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 2 తర్వాత.. అల్లు అర్జున్ డైరెక్షన్‌లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబో గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రెండు ప్రపంచాలు ఉంటాయని.. ఒకటి ప్రజెంట్ కాగా.. మరొకటి అవతార్ తరహా పౌరాణిక, సాంస్కృతిక ప్రేరణతో కూడిన ప్రపంచ‌మ‌ని.. ఇలాంటి విభిన్నమైన కాన్సెప్ట్‌ల‌తో అట్లీ.. వరల్డ్ మార్కెట్‌ను కూడా టార్గెట్ చేశాడట. ఈ క్రమంలోనే పుష్ప తర్వాత అల్లు అర్జున్ రేంజ్‌ను మరింత పెంచేలా ఈ సినిమా ఉండనుందని అభిమానులు నమ్ముతున్నారు.

Producer Change For Allu Arjun Atlee Film | cinejosh.com

ఈ క్రమంలో ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా.. బన్నీ ట్రిపుల్ రేంజ్ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అట్లీ రాసిన ఈ స్టోరీ ఆడియన్స్‌లో హైలెట్‌గా నిలవ‌నుందని సమాచారం. తాజాగా.. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒక‌టి వైర‌ల్‌గా మారుతుంది. ఈ సినిమాలో పవర్ఫుల్ రోల్ కోసం విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ఎప్పటికి లుక్ టెస్ట్ పూర్తయిందని.. రీసెంట్గా విజయసేతుపతి షూటింగ్ సెట్స్ లోను ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిన్న పాత్రలో నటిస్తున్నా ఇంపార్టెన్స్ మాత్రం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫైట్ సీన్స్‌లో విజయ్ సేతుపతి డైలాగ్స్.. ఆడియన్స్‌ను మెప్పించనున్నాయని సమాచారం.

Atlee to team up with Vijay Sethupathi for his next | Tamil Movie News -  Times of India

ముంబైలో శ‌ర‌వేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సెప్టెంబర్ కు పూర్తిచేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే.. ఈ సినిమా ధియేటర్లో చూడాలంటే దాదాపు మరో రెండేళ్లు ఆగాల్సిందే. ఇక గత కొద్దికొద్దికాలంగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి స్టార్ హీరోలు సైతం భయపడిపోతున్నారు అంటూ రకరకాల రూమర్లు వినిపించాయి. ఇలాంటి క్రమంలో.. విజయ్ సేతుపతి బ‌న్నీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం.. ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగిస్తోంది. అట్లీ డైరెక్షన్ కూడా.. విజయసేతుపతి ఈ సినిమాలో నటించిన ఓ కారణమని.. ఆయనతో ఏదో మ్యాజిక్ చేసి ఉంటాడని.. అల్లు అర్జున్ పై ట్రోల్స్ చేసేవారికి అట్లీ డెసిషన్ స్ట్రాంగ్ కౌంటర్ గా మారిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.