సినిమా అంటేనే మాయ ప్రపంచం.. ఎప్పుడు.. ఎవరి లక్ ఎలా ఉంటుంది.. ఎప్పుడు ఎవరు సక్సెస్ అవుతారు.. ఎవరు పాతలానికి వెళ్ళిపోతారో చెప్పలేని పరిస్థితి. కేవలం సినిమా నటినటులు, డైరెక్టర్లే కాదు.. ప్రొడ్యూసర్ల సైతం కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిన సందర్భాలు ఉన్నాయి. నిర్మాతల సంగతి అట్టుంచితే.. మధ్యలో ఉన్న బయ్యర్స్ సైతం భారీ నష్టాలను ఎదుర్కొంటారు. అయితే.. నిర్మాతల గురించి ఆలోచించేవారు కూడా బయ్యర్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఎంతసేపు సినిమా ఫ్లాప్ అయింది. నిర్మాతకు నష్టం వచ్చిందని జాలిపడతారు. బయ్యర్స్ వైపు మాత్రం కనీసం కన్నెత్తి చూడరు. నిర్మాతలకు నాన్ థియేట్రికల్ ఆడియో రైట్స్.. ఇతర హక్కుల ద్వారా అయినా కొంతమేరకు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది.
కానీ.. బయర్లకు అలాంటి ఆపర్చునిటీ కూడా ఉండదు. వాళ్ళు డబ్బు పోతే మళ్ళీ తిరిగి రానట్టే. ఈ క్రమంలోనే బయ్యర్స్‌ను పట్టించుకోవాలని చాలా తక్కువ మంది నిర్మాతలు మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్లలో దిల్ రాజు పేరు మొదట వినిపిస్తుంది. ఇప్పుడు అదే లిస్టులో నిర్మాత నాగవంశీ కూడా చేరనున్నాడని.. రీసెంట్గా ఆయన తీసుకున్న నిర్ణయమే దానికి నిదర్శనం అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. నాగ వంశీ నిర్మించిన గత మూడు సినిమాలు ఘోరమైన డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక వార్ 2 అయితే.. ఎంత పెద్ద దెబ్బతీసిందో కలెక్షన్లు చూస్తేనే క్లారిటీ వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి సినిమాకు సాయంత్రానికే ప్రెస్ మీట్ పెట్టి సందడి చేసే నాగవంశీ.. వార్ 2 విషయంలో ఎలాంటి హడావిడి చేయకుండా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు.
దీంతో ఈయనపై ఎన్నో కథనాలు వచ్చాయి. అవన్నీ కేవలం ఫేక్ అని.. నేను బానే ఉన్నా.. ఇంకా10, 15 ఏళ్ళు ఇండస్ట్రీలో ఇలాగే కొనసాగుతా అంటూ ఓ ట్విట్ షేర్ చేసుకున్నాడు. ఇంతకీ నాగ వంశీ వార్ 2, కింగ్డమ్ బయ్యర్ల కోసం తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి.. వాళ్లకి ఇచ్చిన జాబ్ పార్టీలు ఏంటో ఒకసారి చూద్దాం. నాగ వంశీ.. త్వరలోనే మాస్ జాతర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను బయ్యర్లకు ఉచితంగా ఇవ్వడమే ఆయన ఆలోచనట. భారీగా నష్టపోయిన ప్రతి ఒక్క బయ్యర్ కు ఈ సినిమా ఉచితంగా ఇచ్చేస్తానని.. ఆయన చెప్పాడు. కానీ.. బయ్యర్స్ అందుకు ఒప్పుకోలేదని.. మాకు డబ్బులు రిటర్న్ ఇచ్చేయమంటూ రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో నాగావంశీ వాళ్ళని హైదరాబాద్ కి పిలిపించి మాస్ జాతర స్పెషల్ ప్రీమియర్ షో వేసి మరీ చూపించాడు. వాళ్లకు సినిమా బాగా నచ్చేయడంతో నాగవంశీ ఇచ్చిన జాక్పాట్ ఆఫర్లు ఒప్పేసుకున్నారు. దీంతో మాస్ జాతర రిలీజ్ కు ఇప్పటికే లైన్ క్లియర్ అయిపోయింది. ఇక ఈ నెట 27న రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా రిలీజై బయ్యర్స్ కు ఎంత మేరకు న్యాయం చేస్తుందో.. ఎలాంటి కలెక్షన్లు తెచ్చి పెడుతుందో చూడాలి.