ఓజి హిందీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ.. ఇది పవన్ క్రేజ్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధుల‌లో బిజీ బిజీగా గడుపుతూనే.. మ‌రో ప‌క్క ఖాళీ దొరికిన‌ప్పుడ‌ల్లా సినిమామ‌ల‌తో సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్ నటించిన ప్రాజెక్టులలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి ఒకటి. సుజిత్ డైరెక్షన్‌లో.. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా ఓ మూవీ రూపొందింది. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు.. ఎస్.ఎస్. థ‌మన్ సంగీతం అందించారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 27న దసరా కానుకగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే దీనిని అఫీషియల్‌గా వెల్లడించారు. ఇక.. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు మేకర్స్.

కొన్ని పోస్టర్లతో పాటే సాంగ్స్ రిలీజ్ చేసి ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కేవలం పవన్ ఆడియన్స్ కాదు ఇతర సినీ ప్రేక్షకుల్లో సైతం ఈ సినిమాపై ఆసక్తి మొదలైంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానున్న క్రమంలో.. సినిమాకు సంబంధించిన హిందీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. హిందీ డిజిటల్ రైట్స్.. స్టార్ గోల్డ్ టీవీ భారీ ధరకు దక్కించుకుందట.

రిలీజ్‌కు చాలా రోజులు సమయం ఉన్న‌ ఈ సినిమా.. హిందీ సాటిలైట్ హక్కులు భారీ ధ‌ర‌కు అమ్ముడుపోవడం అంటేనే.. పవన్ కు బాలీవుడ్ లో ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో అర్ధమైపోతుంది. ఇక.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న క్ర‌మంలో.. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా సూపర్ సాలిడ్ కలెక్షన్లు కొల్లగొడుతుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. ఈ సినిమా రిలీజై ఎలాంటి టాక్ని తెచ్చుకుంటుందో.. ఏ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.