టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో “వాల్తేరు వీరయ్య” ఒక మైలురాయి లాంటి మూవీ. ఈ మూవీతో ఆయన మరోసారి తన స్టామినాని రుజువు చేశారు. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టి, మెగాస్టార్ మార్క్ ఏమిటో చూపించారు. ఆ సినిమాను తెరకెక్కించినవారు మెగాభిమాని, ప్రతిభావంతుడైన దర్శకుడు కొల్లి బాబీ (బాబీ కొల్లి). అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తుంచుకునేలా హిట్ ఇచ్చిన ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వడం గ్యారంటీగా ఎగ్జైట్ చేసే అంశమే. ఇక తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్‌పై మరో సంచలన వార్త వినిపిస్తోంది. బాబీ డైరెక్షన్‌లో చిరంజీవి పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ అవతారం ఎత్తబోతున్నారట.
“డాకు మహారాజ్” సినిమాలో లాగే కానీ, ఆ లెవెల్‌ని మించిపోయే ఎలివేషన్స్‌తో మెగాస్టార్‌ను బాబీ డిజైన్ చేస్తున్నట్లు టాక్. ఈ కాంబినేషన్‌లో మాస్ యాక్షన్, హై వోల్టేజ్ ఎమోషన్స్ పుష్కలంగా ఉండబోతున్నాయని ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ కెరీర్‌లో గ్యాంగ్‌స్టర్ రోల్స్ ఎప్పుడూ హైలైట్‌గా నిలిచాయి. “యముడికి మొగుడు”, “అన్నయ్య” లాంటి సినిమాల్లో ఆయన చేసిన పవర్‌ఫుల్ మాస్ క్యారెక్టరైజేషన్స్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు అదే స్టైల్‌లో కానీ, మరింత స్టైలిష్ లుక్, మోడ్రన్ ప్రెజెంటేషన్‌తో బాబీ హ్యాండిల్ చేయబోతున్నారని టాక్.
పవర్‌ఫుల్ డైలాగ్స్, మాస్ యాక్షన్ సీన్స్, స్టైల్ ఎలివేషన్స్.. ఇవన్నీ మిక్స్ అవుతే ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మెగాస్టార్ కెరీర్‌లో మరో “వాల్తేరు వీరయ్య” లాంటి బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌లో టాప్ టెక్నీషియన్స్, క్రేజీ కాస్ట్ ఉండబోతుందని, రోల్‌కు సరిపోయే లుక్ కోసం మెగాస్టార్ ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.మొత్తానికి, మెగాస్టార్ గ్యాంగ్‌స్టర్ లుక్లో స్క్రీన్‌పై కనిపించడం.. పవర్‌ఫుల్ ఎలివేషన్స్‌తో అదరగొట్టడం.. అన్నీ కలిపి ఫ్యాన్స్‌కి పండగలాంటిదే. చిరంజీవి – బాబీ కాంబినేషన్ మరోసారి సాలిడ్ మాస్ ఎంటర్టైనర్‌ని అందించబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.