తారక్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. దేవర 2 పై బిగ్ అప్డేట్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత.. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా తనకంటూ ఒక మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తర్వాత దేవర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. భారీ అంచ‌నాల న‌డుమ రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమా సీక్వెల్ పై ఆడియన్స్‌లో భారీ హైప్ మొదలైంది. ఇక దేవర పార్ట్ 1 వచ్చిన తర్వాత.. ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులలో బిజీగా ఉండ‌టం.. వార్ 2, ప్రశాంత్ నీల్‌తో మరో ప్రాజెక్ట్.. అలాగే నిల్సన్ దిలీప్ కుమార్ తో ఇంకో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఇక దేవర పార్ట్ 2 లేన‌ట్టే అనే టాక్‌న‌డిచింది.

Devara 2 confirmed. Jr NTR teases a grander sequel and drops a major hint  'Next time, it's about Vara' - The Economic Times

ఇలాంటి క్రమంలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఎన్టీఆర్ దేవర 2 కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ నుంచి వార్ 2 సినిమా కూడా రిలీజ్ అయిపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో సినిమాను పూర్తి చేస్తున్నాడు తారక్. ఈ క్రమంలోనే.. దేవర పార్ట్ 2 షూట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ సందేహాలు అభిమానులలో మొదలయ్యాయి. అయితే.. తాజాగా దేవర పార్ట్ 2 పై ఫ్యాన్స్ కు అప్డేట్ వినిపిస్తోంది. కొరటాల శివ ఇప్పటికే దేవర పార్ట్ కి సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేసేసాడట.

Devara Part 2 major update | Koratala Siva drops Jr NTR starrer Devara:  Part 2 MAJOR update: 'It depends on...' | Telugu News - News9live

దేవర 2 షూట్ పై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ రాకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఇదే ప్ర‌జెంట్ వైర‌ల‌ల్ అవుతుంది. అంతేకాదు పార్ట్ 2 కోసం కొన్ని పాన్ ఇండియా లెవెల్ ఎలివేషన్స్ యాడ్ చేసినట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఈ ఎలివేషన్స్ ఉండనుఏన్నాయ‌ని సమాచారం. ఇక జాన్వి కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెరిసిన.. దేవరకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే సినిమా సీక్వెల్ పై సైతం ఆడియన్స్‌లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో.. ఆడియన్స్ లో ముందు ముందు ఎలాంటి హైప్ ను క్రియేట్ చేసుకుంటుందో చూడాలి.