టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వర్తిస్తూనే మరో పక్కన సినిమా షూట్ లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నుంచి తాజాగా హరిహర వీరమల్లు సినిమా రిలీజై ఊహించిన రేంజ్ లో రిజల్ట్ ను అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్టుల్లో ఓజీ ఒకటి.
సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్లో రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌తో మెల్లమెల్లగా హైప్‌ను పెంచే ప్లాన్ చేస్తున్నారు టీం. ఈ క్రమంలోనే తాజాగా.. సినిమా ఫస్ట్ సింగిల్ ఫైర్ స్ట్రామ్ రిలీజై ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొద్ది గంటల్లో సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ ఫాన్స్ కు షేర్ చేయనున్నారట మేకర్స్.
అసలు మేటర్ ఏంటంటే.. సినిమా నుంచి ఈరోజు సాయంత్రం 4.05 నిమిషాలకు మూవీ సెకండ్ సింగిల్.. కమ్మని సాంగ్ రిలీజ్ చేయనున్నారట. ప్రియాంకా అరుళ్ మోహన్, పవన్ మధ్య ఈ సాంగ్ సాగుతుందంటూ.. హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ అంటూ అలర్ట్ ఇచ్చారు మేకర్స్. ఇంకా ఈ సాంగ్ ఆడియన్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.