మెగా 157 లెక్కల్లో తేడా.. అనిల్ ప్లాన్ మొత్తం రివర్స్ అయిందా..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా 157 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను.. అనిల్ రావిపూడి తనదైన స్టైల్‌లో చిరంజీవిలోని కామెడీ యాంగిల్‌ని తీస్తూ.. వింటేజ్ చిరును చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమా షూట్ ప్రస్తుతం జెట్‌ స్పీడ్‌తో కొనసాగుతుంది. ఎలాగైనా వచ్చే ఏడాదికి సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ అయ్యేలా మేకర్స్ మొదటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి అనుగుణంగా సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు అనీల్. ఇలాంటి క్రమంలో.. అనిల్ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయిందని.. దానికి కారణం కూడా చిరంజీవి అంటూ ఓ టాక్‌ వైరల్‌గా మారుతుంది.

Two Mega Dates For Chiranjeevi, But… | Two Mega Dates For Chiranjeevi, But…

అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో హీరో ఎవరైనా సరే.. ఒక్కసారి ఒకే హీరో నుంచే రెండు సినిమాలు వస్తున్నాయి అంటే కచ్చితంగా ఆ రెండు సినిమాల రిలీజ్ డేట్ల మధ్య లాంగ్ గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. కారణం.. మొదటి రిలీజ్ అయిన సినిమా కంటే రోజుల వ్యావ‌ధిలో సెకండ్ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాపై ఖచ్చితంగా ప్రభావం పడుతుందనే ఉద్దేశంతోనే. దీని ప్రభావంతో మేకర్స్ కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే.. రెండు సినిమాల మధ్యన ఖచ్చితంగా భారీ గ్యాప్ ఉండేలా మేకర్స్ జాగ్రత్త తీసుకుంటారు. కానీ.. చిరంజీవి విషయంలో ఇది రివర్స్ అయిందట. అసలు మ్యాటర్ ఏంటంటే.. చిరంజీవి దాదాపు ఏడాది క్రితం మల్లిడి వశిష్ట డైరెక్షన్లో విశ్వంభ‌ర సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

Mega157: Nayanthara CONFIRMS Role In Chiranjeevi-Anil Ravipudi's Film With  New Video

ఈ సినిమా ప్రారంభమైన తర్వాత ఈ ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా మేకర్స్ కూడా ప్రకటించారు. కానీ.. సినిమా భారీ గ్రాఫిక్స్ పనులు ఉండడంతో సీసీ వర్క్ లో ఎర్రర్స్ సరిచేసుకునే పనిలో పడిన టీం.. అంతకంతకు సినిమా రిలీజ్ ఆలస్యం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎడాది సంక్రాంతి బరిలో ఆగిపోయిన విశ్వంభరను కూడా అక్టోబర్‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడట వశిష్ట. కానీ.. ఇప్పుడు సినిమా రిలీజ్ కి మరింత ఆలస్యం అవుతుందని.. డిసెంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇలాంటి క్రమంలో మెగా 157.. వచ్చేయడాది జనవరిలో రిలీజ్ అయితే కచ్చితంగా దానిపై విశ్వంభర సినిమా ఎఫెక్ట్ పడుతుంది. దీంతో.. అనిల్ రావిపూడి వేసిన లెక్కలన్నీ మారిపోతాయి. ఈ క్రమంలోనే మెగా 157 సంక్రాంతికి వస్తుందా.. లేదా.. విశ్వంభ‌ర కారణంగా పోస్ట్ పోన్ అవుతుందా చూడాలి.