వార్ 2 తెలుగు వర్షన్ బుకింగ్స్.. ఎలా ఉన్నాయంటే..?

మరో ఐదు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ 2 వర్సెస్ కూలి పోరు మొదలుకానుంది. ఈ పోరులో ఎవరు విన్నార్‌గా నిలుస్తారనేది ఇప్పుడు ఆడియన్స్‌లో ఆసక్తిగా మారింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 సినిమా.. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలి సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు ప్రెస్టేజస్‌ ప్రాజెక్టులే కావడం.. అది కూడా భారీ కాస్టింగ్ తో వస్తున్న సినిమాలు కావడంతో ఆడియన్స్‌లో సినిమాలపై మరింత పెరిగింది. అయితే కూలి సినిమాకు ఉన్నంత రేంజ్ లో క్రేజ్ మాత్రం వార్ 2కు ద‌క్క‌డం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కూలి ఓపెన్ బుకింగ్స్ తో సంచలనాలు సృష్టిస్తుంటే వార్ 2 మాత్రం దానిలో పావు వంతు కూడా ద‌క్కించుకోలేకపోతోంది.

బయట మార్కెట్‌ను బట్టి.. వార్ 2 అనవసరంగా కూలీలతో పోటీపడుతుంది అనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరో తేదీని నిర్ణయించుకుని ఉంటే వార్ 2కి మంచి ఓపెనింగ్స్ అయినా దక్కేవి అంటూ సోషల్ మీడియాలో విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. య‌ష్ రాజ్ సంస్థ వాళ్ళు నార్త్ అమెరికాలో వార్ 2 సినిమాకు అప్పుడే 1800 షోస్ ని షెడ్యూల్ చేయగా.. అందులో తెలుగు వర్షన్ కి 800 షోస్ వరకు కేటాయించారు. కూలీ కంటే ఎక్కువ షోస్ వార్ 2 సినిమాకి ఉన్నప్పటికీ.. టికెట్స్ మాత్రం ఆ రేంజ్ లో అమ్ముడుపోవడం లేదు. ఇక.. ఇప్పటివరకు వార్ 2కి తెలుగు ప్లస్ తమిళ్ వర్షన్లలో కేవలం 9,300 టికెట్లు మాత్రమే అమ్ముడు పోగా.. కూలీ సినిమాకు ఏకంగా 44,508 టికెట్లు సేల్ అయ్యాయి.

అంటే.. వార్ 2 సినిమా కనీసం కూలి తెలుగు వర్షన్ గ్రాస్ వ‌సూళ‌ను కూడా రాబట్ట లేకపోయింది. తెలుగులో కూలి సినిమాకి 9,000 కు పైగా టికెట్లు అమ్ముడు పోగా.. వార్ 2 సినిమాకు 7800 టికెట్లు మాత్రమే కొనుగోలు అయ్యాయి. ఇలా గ్రాస్ చూస్తే వార్ 2 సినిమాకు తెలుగు వర్షన్ లోనే $217 కే గ్రాస్ వచ్చింది. కూలికి ఏకంగా $290 కే దక్కింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పేరు టాలీవుడ్ వర్షన్ కు పెద్దగా పనికిరాలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నుంచి ఫుల్‌ సాంగ్ రిలీజ్ చేసి ఉన్న బాగుండేది కేవలం చిన్న ప్రోమోతో మేకర్ సరిపెట్టి తప్పు చేశారంటూ.. ఒకవేళ పాట హీట్ అయ్యుంటే కచ్చితంగా సినిమాపై నెక్స్ట్ లెవెల్లో హైప్‌ మొదలయ్యేది అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత అయినా కూలి సినిమాను వార్ 2ను డామినేట్ చేస్తుందో.. లేదో.. ఏ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడుతుందో చూడాలి. కాగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆదివారం నుంచి బుకింగ్స్ ప్రారంభించనుంది.