కూలి మూవీ నాగ్ రోల్‌పై ఇంట్ర‌స్టింగ్ సీక్రెట్ లీక్ చేసిన లోకేష్ కనకరాజ్..!

కోలీవుడ్ థ‌లైవార్ రజనీకాంత్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ గనుక రాజ్యం కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కరుణానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాలో నిర్మించారు. ఇక ఈ సినిమాలో నెగిటివ్ స్టేట్స్ కోసం కింగ్ నాగార్జున మెర‌వ‌నున్నాడు. ఇక ఈ సినిమాల్లో అమీర్‌ఖాన్‌, శృతిహాసన్, సత్య‌రాజ్‌, ఉపేంద్ర, సౌబిన్‌ షాహీర్, పూజా హెగ్డే, రెబ్బ మౌనిక జాన్ తదితరులు కీలక పాత్రలో మెరిశారు. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో.. ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్‌లో.. ఫ్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ క్రమంలోనే రజినీకాంత్‌కు సంబంధించిన స్పెషల్ వీడియోలు షేర్ చేసుకున్నారు.

Superstar Rajinikanth on @thekingnagarjuna and his role as Simon in  Coolie.. Nagarjuna is not just a fantastic actor—he’s a true gentleman. His  charm, his grace, the way he carries himself both on and ...

ఆ వీడియోలో రజనీకాంత్ మాట్లాడుతూ.. కథ వినే టైంలో.. నాగార్జున పోషించిన సైమన్ రోల్ నేను చేయాలన్నంత ఆశ‌క్తి నాలో వచ్చిందంటూ వివరించాడు రజిని. ఆ పాత్రకు ఉన్న స్టైలేష్‌నెస్, పవర్ అలాంటిది మరి. కూలి కథ విన్నాక ఆ సైమన్ రోల్ కోసం ఎవరు నటిస్తారని ఆసక్తి నాలో పెరిగింది.. ఇక నాగార్జున దానికి ఒప్పుకున్నారని తెలియడంతో షాక్ అయ్యా.. దాదాపు 33 ఏళ్ల క్రితం ఆయనతో సినిమా చేశా.. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నాడు. నాకు జుట్టు అంతా ఊడిపోయింది. నాగ్‌తో కలిసి థాయిలాండ్ లో చేసిన 17 రోజుల షెడ్యూల్ నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోను అంటూ రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. భాష – ఆంటోనీ ఎలాగో.. కూలీలో.. దేవా – సైమన్ అలా పవర్ ఫుల్ గా ఉంటారని రజినీకాంత్ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇక నాగార్జున ఈవెంట్లో మాట్లాడుతూ.. ఖైదీ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్‌ డైరెక్షన్లో చేయాలని బలంగా అనుకున్నా. కూలీతో నాకు ఆ ఛాన్స్ దొరికిందంటూ చెప్పుకొచ్చాడు.

Lokesh Kanagaraj SUPERB Speech | Nagarjuna | Rajinikanth | Coolie Pre-  Release Event & Press Meet - YouTube

నిన్నే పెళ్ళాడుతా లాంటి లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌లో నటించిన తర్వాత.. అన్నమయ్య లాంటి సినిమా చేస్తుంటే.. ఇలాంటి ప్రయోగాలు అవసరమా అని నన్ను ఎంతోమంది వెనక్కి లాగారు. అయినా.. నేను కొత్త ప్రయోగాలు ఎన్నో చాలా దెబ్బలు తిన్న. మంచి సక్సెస్ కూడా అందుకున్న అంటూ నాగార్జున వివరించాడు. ర‌జినీ గారు చెప్పినట్టు ఎప్పుడూ మంచి వాళ్ళ లాగ నటిస్తే బాగుండదు. అందుకే విలన్ గా చేయడానికి ఒప్పేసుకున్నా. లొకేషన్ నన్ను కలిసినప్పుడు మీరు విలన్ గా చేస్తానంటే నేను మీకు ఒక కథ చెప్తా అన్నాడు. నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సరే చెప్పమన్నా. ఫస్ట్ డే షూట్లో రజినీని కలిసినప్పుడు ఆయన కాసేపు నన్ను అలాగే చూస్తూ ఉండిపోయారు. మీరు ఇలా ఉన్నారని తెలిస్తే అసలు సినిమాలో నాగార్జున వద్దని లోకేష్ కి చెప్పేసే వాడిని అంటూ సరదా కామెంట్స్ చేశార‌ని నాగార్జున వివరించాడు. ఇక లోకేష్ కనకరాజు మాట్లాడుతూ.. నాగార్జున కోసం సైమన్ రోల్ గురించి ఏడుసార్లు నరేట్‌ చేశానని.. చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో శృతిహాసన్, సత్యరాజ్‌, దిల్ రాజు, సురేష్ బాబు, సునీల్ నారంగ్‌ తదితరులు పాల్గొన్నారు.