కూలీలో నాగార్జున విలన్ గా అందుకే చేశారు.. రజినీకాంత్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన మూవీ కూలీ. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ కింగ్‌ నాగార్జున, శాండిల్‌వుడ్‌ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్‌ల‌తో పాటు.. సౌబిన్ షాహిర్, సత్య‌రాజ్ తదితరులు కీలకపాత్రలో మెరిసిన సినిమాకు లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వం వహించారు. సన్‌ పిక్చర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా తాజాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్గా ఏర్పాటు చేసి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఇక ఈ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ.. కూలి సినిమా 100 భాషా సినిమాలతో సమానం అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఇక రజనీకాంత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీకే ఓజి అంటూ వివరించాడు. ఆపై రజనీకాంత్ నాగార్జున గురించి మాట్లాడుతూ.. ఫస్ట్ టైం నాగ్‌ను చూసినప్పుడు.. అబ్బా ఏం కలరు, ఏం స్కిన్.. హాయ్ అనుకుంటే చూస్తూ ఉండిపోయా. నాకు జుట్టు అంతా ఊడిపోయింది. మీ హెయిర్ సీక్రెట్ ఏంటని అడిగితే బాడీ ఎక్సర్సైజ్లే.. ఏమీ లేదంటూ చెప్పుకొచ్చారని రజినీకాంత్ వివరించాడు. ఇక విలన్ గా నాగ్ ఎందుకు చేశారంటే అంటూ.. వెంకటప్రభు డైరెక్షన్‌లో వచ్చిన గ్యాంబ్లర్ హీరో అజిత్ చెప్పిన డైలాగు వివరించాడు.

10 key moments from Rajinikanth's speech at Coolie Audio Launch

ఎంత కాలం మంచివాడిగా నటించేది మాదిరి.. నాగార్జున కూడా ఈ సినిమాలో విలన్ గా మారిపోయారని.. కమల్ హాసన్ షాక్ అయ్యే రేంజ్ లో నాగార్జున ఈ సినిమాలో మెరిసారని వివరించాడు. ఇక నా సక్సెస్ సీక్రెట్ కేవలం కష్టం మాత్రమే కాదు.. భగవంతుడు ఆశీస్సులు. నేను బస్ కండక్టర్గా పనిచేస్తున్నప్పుడు మిత్రుడు ఒకడు బంగారు చైన్ ఇచ్చి సినిమాల్లో నటించమని నన్ను పంపాడు. అందుకే ఈరోజు నేను ఇక్కడ ఉన్నా. ఎంత ధనం, పేరు ఉన్న ఇంట్లో ప్రశాంతత, గౌరవం లేకుంటే ఏదీ జరగదు అంటూ రజనీకాంత్ కామెంట్స్‌ చేశారు. ఈ వేడుకల్లో సినీ యూనిట్ సభ్యులంతా సందడి చేశారు.