టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నుంచి గత రెండేళ్లుగా ఏ చిన్న అప్డేట్ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్‌లో కండిషన్స్ ఉంటాయో.. ఎంత స్ట్రిక్ట్‌గా వాటిని అప్లై చేస్తారో తెలిసిందే. ఈ క్రమంలోనే.. మహేష్ బాబు పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో కూడా.. గత రెండేళ్ల నుంచి ఎలాంటి అప్డేట్ ను కూడా రివీల్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు టీం. ఈ ఏడాది కూడా అలానే మహేష్ పుట్టినరోజుకు ఎలాంటి అప్డేట్‌ను రిలీజ్ చేయడం లేదని.. ఇప్పటికే దానిపై ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తయ్యే వరకు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వకూడదని జక్కన్న ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది.
ఇంత సీక్రెట్ గా సినిమాను నడుపుతున్నాడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరికి గూస్‌బంప్స్ తెప్పించే రేంజ్‌లో ఏదో డిజైన్ చేస్తున్నాడని.. ఏదో బిగ్ సర్ప్రైజ్ ఏ ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇలాంటి క్రమంలో.. మహేష్ ఫ్యాన్స్‌కు ఒక అదిరిపోయే అప్డేట్ అన్ అఫీషియల్గా వైరల్ గా మారుతుంది. అదేంటంటే.. సెప్టెంబర్ రెండో వారంలో సౌత్ ఆఫ్రికాలోని టాన్జానియా ప్రాంతంలో బిగ్గెస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట టీం. ఇక్కడ ఇప్పటివరకు కేవలం కొన్ని హాలీవుడ్ సినిమాలు మాత్రమే షూట్ జరుపుకోగా.. మొట్టమొదటిసారి ఓ ఇండియన్ మూవీ షూట్ కు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారట. అంటే.. కేవలం మహేష్, రాజమౌళి సినిమాకు మాత్రమే ఆ రికార్డ్ దక్కింది. పృథ్వీరాజ్ కూడా సందడి చేయనున్నారని టాక్.
ఈ సినిమాలో వీళ్ళిద్దరు నెగిటీవ్ షేడ్స్‌లో కనిపించనున్నారట. హీరోయిన్ మరియు ఇతర కాస్టింగ్ వివరాలను మాత్రం ఇప్పటికీ టీం హైప్ చేస్తూనే వస్తున్నారు. సౌత్ ఆఫ్రికాకి బదులు కెన్యాలోని శరంగంటి నేషనల్ పార్క్ లో డిజైన్ చేయాలని మొదట అనుకున్నా.. కన్యాలో పరిస్థితుల కారణంగా అక్కడ నుంచి సౌత్ ఆఫ్రిక.. టాంజానియాకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇక ఈ షెడ్యూల్లో డైనోసార్లతో హీరో ఫైట్ చేసే సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. రామాయణంలో ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకురావడం అంతా వినే ఉంటాం. కచ్చితంగా సినిమాల్లోనైనా చూసే ఉంటాం. అదే సంజీవని కోసం మహేష్ చేసే పోరాటమే సినిమా స్టోరీ అని.. ఈ ప్రయాణంలో ఆయనకు ఎదురయ్యే సవాళ్లు గూస్ బంప్స్ తెప్పించే రేంజ్‌లో అడ్వెంచర్స్‌తో సినిమా రూపొందుతుందని తెలుస్తుంది. ఇక మహేష్ తండ్రిగా తమిళ్ హీరో మాధవన్ మెరవనున్నాడట.