ఏదేమైనా పెళ్లి మాత్రం అతన్నే చేసుకుంటా.. అనుష్క షాకింగ్ అనౌన్స్మెంట్..!

స్టార్ హీరోయిన్ అనుష్క.. టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్‌, పాపులారిటి దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ అమ్మడు.. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ ఏర్పరచుకుంది. ఈ క్రమంలోనే స్వీటీ అంటూ అనుష్కను ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు. అయితే.. నాలుగు పదుల వయసు మీద పడుతున్న స్వీటి ఇంకా వివాహం చేసుకోలేదని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనుష్క పెళ్లికి సంబంధించిన ఎన్నో రకాల రూమర్లు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉన్నాయి.

ప్రభాస్‌తో ప్రేమాయణం నడుపుతుందని.. వీళ్లిద్దరు వివాహం చేసుకోబోతున్నారు అంటూ మొదట్లో వార్తలు వినిపించాయి. అయితే.. ఈ వార్తలను ఇటు అనుష్కతో పాటు.. ప్రభాస్ కూడా ఖండించిన సంగతి తెలిసిందే. తర్వాత అనుష్క ఓ బ‌డా బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకోబోతుంది అంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ అవి నిజం కాలేదు. ఇలాంటి క్రమంలోనే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క‌.. బ‌హుబ‌లి తర్వాత నా పెళ్లి విషయంలో తెగ ఇబ్బంది పడుతున్నారు. మీడియాలో ఎక్కడ చూసినా నా పెళ్లి గురించి వార్తలు, పెళ్లిపై నాకు పూర్తి నమ్మకం ఉంది.. సరైన టైమ్ వచ్చినప్పుడు సరైన వ్యక్తి దొరికినప్పుడు ఖచ్చితంగా వివాహం చేసుకుంటా అంటూ క్లారిటీ ఇచ్చింది.

ఎలాంటి వ్యక్తి లైఫ్ పార్ట్నర్ గా కావాలో కూడా అనుష్క వివరించింది. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అయితే.. నేను ప్రేమ లేకుండా ఎవరిని వివాహం చేసుకోలేను. ఏమైనాసరే.. నేను ఇష్టపడిన వ్యక్తినే వివాహం చేసుకుంటా. నా తల్లిదండ్రులు నాకు దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. నేన్ను ప్రస్తుతం సరైన వ్యక్తి కోసం, సరైన టైమ్ కోసం చూస్తున్న అంతే.. అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు.. నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని మాత్రం వివాహం చేసుకోవాలని అనుష్క చెప్పేసింది. ఈ క్రమంలోనే తన కాబోయే లైఫ్ పార్ట్నర్ గురించి స్వీటీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.