టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఆడియన్స్ను నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అభిమానుల సైతం దాని ఓపెన్ గానే ఒప్పుకున్నారు. అయితే.. ఓపెనింగ్ విషయంలో మాత్రం పవన్ తన సత్తా చాటుకున్నాడు. దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఓపెనింగ్స్, ప్రీమియర్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసాడు పవన్. ఏకంగా పుష్ప 2 రికార్డును బద్దలు కొట్టి సత్తా చూపించాడు. అయితే.. వీరమల్లు దాదాపు ఆరేళ్లు సెట్స్ లో ఉండడం.. సినిమాపై రిలీజ్ కు ముందు నుంచే నెగటివ్ రివ్యూలు, నెగటివ్ అభిప్రాయాలు వ్యక్తం అవడంతో ఈ సినిమా కలెక్షన్లపై తర్వాత మరింత ప్రభావం పడింది అనడంలో సందేహం లేదు.
ఇలాంటి క్రమంలో.. మొదటి నుంచి భారీ హైప్ నెలకొల్పిన మోస్ట్ అవైటెడ్ మూవీ.. ఓజి సినిమా ప్రీమియర్స్ ఏ రేంజ్లో ఓపెనింగ్ దక్కించుకుంటాయో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఈ క్రమంలోనే ఇప్పటి నుంచి అడ్వాన్స్ బుకింగ్ కోసం సిద్ధమవుతున్నారు ఫ్యాన్స్. సెప్టెంబర్ 25న దసరా కానుకగా గ్రాండ్ లెవెల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2 నుంచి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ను ప్రారంభించనున్నారట డిస్ట్రిబ్యూటర్స్. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో హైయెస్ట్ ప్రీమియర్ షోస్ పడిన రికార్డ్ పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు.
అలాంటి పవన్ నుంచి వచ్చిన హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్ కనీసం వన్ మిలియన్ డాలర్లు కూడా దక్కించుకోలేకపోయాయి. కారణం.. సినిమాకు సరైన ప్లానింగ్ లేకపోవడం. ఆడియన్స్ లో మంచి హైప్ తెచ్చుకోలేకపోవడమే. ఈ క్రమంలోనే ఓజి విషయంలో పక్కా ప్లానింగ్ తో వెళ్లాలని టీం ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ 10 లోపే.. మొదటి కాపీని సిద్ధం చేసి డిస్ట్రిబ్యూటర్లకు అందించనున్నారని సమాచారం. ఇక మొదటి కాపీ సిద్ధమయ్యేలోపే 1000 షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులంతా భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి.