పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబో అంటేనే ఒక పవర్ఫుల్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్లో హైప్ ఉంటుంది. కారణం.. గతంలో వచ్చిన బద్రి మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో తెలిసిందే. ఇక.. తర్వాత మూవీ.. కెమెరామెన్ గంగతో రాంబాబు. 2012లో రిలీజైన ఈ సినిమా అప్పుడు ఉన్న పరిస్థితుల రిత్యా మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. అయినా.. పవన్ పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబో రిపీట్ కాబోతుందంటూ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది.
ఈ క్రమంలోనే.. ఫ్యాన్స్ వీళ్ళిద్దరి కాంబోలో మూవీపై ఆసక్తి కనబరిస్తున్నారు. ప్రస్తుతం పవన్ తన సినీ కెరీర్‌తో పాటే.. రాజకీయాల్లోనూ బిజీబిజీగా గడుతున్నారు. తాజాగా.. హరిహర వీరమల్లు రిలీజ్ కాగా.. నెక్స్ట్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఆయన నుంచి ఆడియన్స్‌ను పలకరించనున్నాయి. ఇక.. ఈ సినిమాల తర్వాత యాక్టింగ్ కాస్త గ్యాప్ ఇస్తానని.. రాజకీయాల్లో బిజీ అవ్వాల్సి ఉందంటూ చెప్పుకొచ్చిన పవన్.. వీలైతే ఏదైనా సినిమాకు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ నుంచి ప్రొడ్యూసర్ గా చేస్తానంటూ వివరించాడు.
రాజకీయ బాధ్యతను తర్వాత కొంతకాలం మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే పూరి కాంబినేషన్లో పవన్ మళ్ళీ సినిమా చేసే అవకాశం ఉందని టాక్. కాగా.. పవన్ కచ్చితంగా పూరి సినిమాకు నిర్మాతగానే వ్యవహరించినన్నాడు.. హీరోగా చేసే అంత ఖాళీ లేదంటూ మరి కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక పూరీ ప్రజెంట్ విజయ్ సేతుపతితో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ తో కొత్త సినిమా కోసం పూరి జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో వినిపించినా.. పవన్, పూరి కాంబోలో వస్తున్న సినిమాకు ఆయన ప్రొడ్యూసరా.. హీరోనా.. అనే సందేహాలకు మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.