కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయిన లోకేష్ కనకరాజ్.. కూలి విషయంలో ఇంత దారుణమా..?

కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కూలి సినిమా ఆగ‌ష్ట్‌ 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. తెలుగు ఆడియన్స్‌లో కూడా ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ కు విలన్ గా టాలీవుడ్ కింగ్ నాగార్జున మెర‌వ‌నుండ‌టం.. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా కివ‌డంతో రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. భారీ కాస్టింగ్ కూడా ఉండడం సినిమాకు మరింత హైప్‌ను తెరిచి పెట్టింది.

ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో కూలి సినిమా రికార్డ్ లెవెల్‌లో బిజినెస్ జరుపుకుంటుంది. ఇక.. ఈ పోస్టర్‌లో అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్, సత్యరాజ్, శృతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ ఇలా భారీ తారాగణం అంతా ఉండేలా పోస్టర్ను డిజైన్ చేశారు. మధ్యలో సూపర్స్టార్ రజనీకాంత్ స్టైల్ గా నడిచి వస్తున్న‌ఈ పోస్టర్ తాజాగా ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది. కారణం ఇది ఇంగ్లీషులో రిలీజ్ అయిన మేడ్ ఆమ్ వెబ్ అనే సినిమా పోస్టర్‌కు డిటోదించినట్లు ఉండడమే. లోకేష్ కనగ‌రాజ్‌ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం కాపీ కొట్టి ఇలా అడ్డంగా దొరికిపోయాడంటూ.. అయ్యో పాపం ఏంటి లోకేష్ ఇలా చేశావ్‌ అంటూ.. రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Watch Madame Web (2024) Full Movie Online - Plex

అయితే ఇదేదో యాక్సిడెంటల్‌గా చేసిన పోస్టర్ అనుకోవడానికి కూడా లేదు. ఆ పోస్టర్ చూసి ఈ పోస్టర్ చూసే ఈ పోస్ట‌ర్‌ ప్రింట్ తీసినట్లు క్లియర్ గా అర్థమవుతుంది. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ మాత్రం మంచి రెస్పాన్స్‌ను ద‌క్కించుకున్నాయి. మొదటి సాంగ్ పెద్దగా సౌండ్ చేయకున్నా.. సెకండ్ సాంగ్ మౌనిక మాత్రం ఆడియన్స్ లు హైలెట్గా నిలిచింది. ఎక్కడ చూసిన ప్రస్తుతం ఇదే ట్రెండ్‌ అవుతుంది. అనిరుధ్ మ్యూజిక్‌లో ఉండే మ్యాజిక్ ఇదే అంటూ ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పాటతో పాటే తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన పవర్ హౌస్ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ను ద‌క్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమాపై నెక్స్ట్ లెవెల్‌లో హైప్ నెల‌కొంది. ఇక ఆగస్టు 2న రిలీజ్ చేసే ట్రైలర్ తో ఆడియన్స్ లో ఏ రేంజ్ బ‌జ్‌ తీసుకువస్తారో చూడాలి.