ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకున్న టాప్ 10 ఇండియన్ మూవీస్ లిస్ట్ ఇదే..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తెరకెక్కి బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సినీ ప్రియులంతా సినిమాలకు సంబంధించిన కలెక్షన్లపై ఆసక్తి చూపుతున్నారు. ఏ సినిమా హైయెస్ట్ కలెక్షన్ కొల్లగొట్టింది.. ఏ సినిమాలు భారీ ఓపెనింగ్ ద‌క్కించుకున్నాయో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే.. ప్రస్తుతం ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజై హైయెస్ట్ ఓపెనింగ్ దక్కించుకున్న సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.

Good Bad Ugly to hit the theatres before Vidaamuyarchi? Major updates on  Ajith Kumar's films are out

రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వానీ హీరోయిన్‌గా.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజర్. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.92.25 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా మెరిసిన హరిహర వీరమల్లు సినిమా మొదటి రోజు రూ.70 కోట్ల కలెక్షన్లతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్‌ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన యంపురాన్ మూవీ ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.67.35 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది.

Chhaava (2025) - Movie | Reviews, Cast & Release Date in mandapeta-  BookMyShow

బాలకృష్ణ హీరోగా, బాబి కొల్లి డైరెక్షన్లో రూపొందిన డాకుమహారాజ్ ఫస్ట్ రోజు రూ.51.85 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. అజిత్ కుమార్ హీరోగా తెర‌కెక్కిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ మొదటి రోజు రూ.51.50 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇక రష్మిక మందన హీరోయిన్గా, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో మెరిసిన బాలీవుడ్ మూవీ చావ.. ఫస్ట్ డే రూ.47.5 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. అజిత్ హీరోగా వ‌చ్చిన‌ విడముయ‌ర్చి రూ.41.60 కోట్ల కలెక్షన్లతో బెస్ట్ ఓపెనింగ్ సొంతం చేసుకుంది. నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా, శైలేష్ కొలను డైరెక్షన్లో రూపొందిన హిట్ 3 మొదటి రోజు రూ.40.8 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో అనీల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ.. మొదటి రోజు రూ.40.5 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది.