పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు.. ఇటీవల ఆడియన్స్‌ను పలకరించి మంచి ఆదరణ దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు మొదట కృష్ జాగర్గమూడి దర్శకుడుగా వ్యవహరించగా తర్వాత ఆయన స్థానంలోకి జ్యోతి కృష్ణ వచ్చి మిగతా కథను పూర్తి చేస్తాడు. సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో గతంలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి.
ఇలాంటి క్రమంలోనే.. తాజాగా క్రిష్ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. వీటిపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి గల కారణాలు బయటకు వస్తాయని వివరించిన క్రిష్.. పవన్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చాడట. నాకు, పవన్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ కూడా ఏమీ లేవు. నేను ఓపెన్ గానే ఉన్నా. భవిష్యత్తులో ఆయనతో కలిసి సినిమా చేయడానికి కూడా నేను రెడీ అంటూ క్రిష్ ఆ మీడియా సంస్థతో వివరించాడని సమాచారం.
ఇక ఇటీవల హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌కు ముందు పవన్ పై ప్రశంసలు కురిపిస్తూ క్రిష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి అవడానికి పవన్, ఏ.ఏం. రత్నం ప్రధాన కారణాలు అంటూ ఆయన పోస్టులో రాసుకోచ్చాడు. ఇక జూలై 24న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటి రోజు అక్కడ వన్ మిలియన్ క్లబ్‌లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.