పాన్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేజీఎఫ్ సిరీస్‌లతో ఓల్డ్ వైడ్‌గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నీల్.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాని రూపొందిస్తున్నాడు. కన్నడ బ్యూటీ రుక్మిణి వాసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా మరువనుంది. టాలీవుడ్ బాడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్లుగా.. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. రవి భసృర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా టైటిల్ ఇదేనంటూ ఇప్పటికే ఏన్నో పేర్లు వైరల్ గా మారాయి.
అయితే.. తాజాగా ఎన్టీఆర్ – నీల్ సినిమా టైటిల్ పై మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ క్లారిటీ ఇచ్చేశారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న ఈ సినిమా డ్రాగన్ అనే రన్నింగ్ టైటిల్ తో రూపొందుతుంది. ఈ సినిమాలో మలయాళ సీనియర్ నటుడు బీజూ మీనన్.. అలాగే యంగ్ హీరో టోవినో థామస్ నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మీడియా సమావేశంలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. డ్రాగన్ లో ఆ ఇద్దరు మలయాళ నటులకు ఇంపార్టెంట్ రోల్ కచ్చితంగా ఉంటుంది.
మంచి నటులుగా వాళ్ళిద్దరికీ ప్రశాంత్.. తగిన ఇంపార్టెన్స్ ఇస్తాడని నేను అనుకుంటున్నా.. డ్రాగన్ సినిమా మీరు ఊహించిన దానికంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చాడు. అలా తారక్ – నీల్ సినిమా టైటిల్ డ్రాగన్ అని ఆయన క్లారిటీ ఇచ్చేసాడు. ఇప్పటివరకు రూమర్ గానే ఉన్న టైటిల్ పృధ్వీరాజ్ సుకుమారన్ కన్ఫామ్ చేసేసినట్లే. ఇక తాజాగా ఎన్టీఆర్ నటించిన మరో మూవీ వార్ 2 ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డ్రాగన్ షూట్‌కు బ్రేక్ ఇచ్చాడు తారక్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న క్రమంలో వరుస ప్రమోషన్స్ లో సందడి చేయనున్నాడట.