అందుకే చిరుని దూరం పెట్టాం.. వీరమల్లు ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్.. !

దాదాపు మూడేళ్ల టైం టేకింగ్ తర్వాత టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి ఓ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది అనడంలో సందేహం లేదు. వాటికి ప్రధాన కారణం పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. అలాగే పవన్ కెరీర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి హైప్ నెల‌కొంది. ఇక ఈ ఏడాదిలో టాలీవుడ్‌కు ఒక్కసారైనా హిట్ కూడా పడకపోవడం.. స్టార్ హీరో సినిమాలేవి రాకపోవడం కూడా ఇక ఈ సినిమాపై అంద‌రిలో ఆశ‌క్తి నెల‌కొల్పింది. ఇక ఈ మూవీతో అయినా సరైన బ్లాక్ బస్టర్ కొట్టి టాలీవుడ్ కళకళలాడాలని అంతా అరాటపడుతున్నారు. త్రెడ్ సైతం హరిహర వీరమల్లు సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకుంది. మరి ఇంత మంది ఆడియన్స్ ఆశలను వీరమల్లు నెరవేరుస్తాడా.. లేదా తెలియాలంటే మరో ఐదు రోజులు వేచి చూడాల్సిందే.

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో టీం బిజీ అయ్యారు. తాజాగా ప్రొడ్యూసర్ ఏ.ఏం. ర‌త్నం ప్ర‌స్‌మీట్ నిర్వహించి.. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు.. ఎన్నో ఇంట్రెస్ట్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా సోమవారం జులై 23న జరగబోయే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఆయన మాట్లాడుతూ ఈవెంట్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి లాంటి వారు ముఖ్య అతిథులుగా వస్తున్నారంటూ వివరించాడు. చిరంజీవి గారిని గెస్ట్ గా పిలవాలని అనుకోలేదా అని నిర్మాత రత్నం ను ప్రెస్.. అడగగా కుటుంబ సభ్యులను పిలవ‌కూడ‌ద‌ని అనుకున్నాం. కనుక ఈవెంట్ కు చిరు గారిని ఆహ్వానించలేదంటూ వివరించాడు. అయితే.. పవన్ అభిమానులతో పాటు.. మెగా అభిమానులు కూడా చిరంజీవి ఈవెంట్ కోస్తే బాగుంటుందని అభిప్రాయాల‌ను వ్యక్తం చేస్తున్నారు. కారణం చిరంజీవి ఏ సినిమా గురించి అయినా నిండు మనసుతో కల్మషం లేకుండా మాట్లాడుతాడు.

ఆయన మాటలే సినిమాపై అంచ‌నాలను మరింతగా పెంచుతాయి. దానికి తోడు ఎన్నికల్లో పవన్ గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక ఎన్నో ఎమోషనల్ ఇన్సిడెంట్ జ‌రిగాయి. వాటి గురించి చిరు మాట్లాడితే వినాలని అభిమానులంతా ఎంతగానో ఆరటపడ్డారు. ఈ క్రమంలోనే వారు ఈవెంట్ కు రాకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ ఈవెంట్‌కు రాజకీయ ప్రముఖులు పలువురు హాజరుకానున్నారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్‌, తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కర్ణాటక ప్రాంతం నుంచి పలువురు మంత్రులు కూడా సందడి చేయనున్నారు. శిల్పకళా వేదికలో సోమవారం సాయంత్రం నుంచి ఈవెంట్ గ్రాండ్గా జరుగుతుంది. చాలాకాలం తర్వాత పవన్ తన సినిమా ఈవెంట్‌లో సందడి చేయనున్నాడు, ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌లో ఉత్సాహం నెక్స్ట్ లెవెల్‌కి చేరుకుంది.