సౌత్ స్టార్‌బ్యూటీ త్రిష, జ్యోతికలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకరిని మించి ఒకరు తమ నటనతో ఆడియన్స్‌ను మెప్పిస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మలు ఇద్దరు.. ఇండస్ట్రీలో ఎవరికి వారు తమకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దక్కించుకున్నారు. ఇక నాలుగు పదుల వయసులోనూ ఇప్పటికీ తమ గ్లామర్ లుక్స్ తో ఆడియన్స్ను ఆకట్టుకుంటున్న ఈ ఇద్దరు హీరోయిన్స్.. తమ సెకండ్ ఇన్నింగ్స్‌తో జట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఫస్ట్ నుంచి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి.. బ్లాక్ బస్టర్‌లు ఖాతాలో వేసుకున్న వారే.
ఇలాంటి క్రమంలోనే వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. త్రిష, జ్యోతిక కలిసి ఒకే సినిమాలో మెరవనున్నారని.. స్క్రీన్ పై సందడి చేయనున్నారు అని సమాచారం. అది కూడా ఓ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో కావడం మరింత హైలెట్గా నిలిచింది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. వశిష్ఠ డైరెక్షన్‌లో రూపొందిన విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్‌గా మరవనుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్‌లో జ్యోతిక కూడా కనిపించనుందట. జ్యోతిక స్క్రీన్ పై కొన్ని నిమిషాలే మెరువనుందని.. కానీ కథను మలుపు తిప్పే రోల్ ఆమెదేనంటూ టాక్ ఇండస్ట్రీలో తెగ ట్రెండింగ్‌గా మారుతుంది.
జ్యోతిక, చిరంజీవి ఠాగూర్ సినిమాలో ఇప్పటికే కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత.. వీళ్ళిద్దరూ మల్లి ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత ఒకే స్క్రీన్ పై మరువనున్నారని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది కూడా త్రిష, జ్యోతిక, చిరంజీవి ముగ్గురు కాంబో సినిమా అంటే ఇక ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వాల్సిందే అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా విఎఫ్ఎక్స్ కారణంగా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా రిలీజ్‌కు మరికొంత ఆలస్యమవుతుందంటూ మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.