టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఎంతోమంది ఓ సినిమాను తెరకెక్కించాలంటే ఏళ్లకు తరబడి సమయాన్ని కేటాయిస్తున్నారు. అంతేకాదు.. సినిమా పూర్తై నెక్స్ట్ సినిమా ప్లాన్ చేయాలన్న సంవత్సరాల సమయం పడుతుంది. అలాంటి తరుణంలో టాలీవుడ్లో సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్న ఓ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం వీరందరికీ భిన్నంగా తనదైన స్టైల్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ ని చూపిస్తున్నాడు.
ఓ సినిమాను ఎంతైతే వేగంగా తెరకెక్కించి సక్సెస్ అందుకుంటున్నాడు.. తన నెక్స్ట్ సినిమాను తీయడానికి కూడా అంతే వేగాన్ని చూపిస్తున్నాడు. అలా కొంతకాలం క్రితం విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతి వస్తున్నాం సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఆయన.. బ్లాక్ బస్టర్ సక్సెస్ను అందుకున్నాడు. ఈ సినిమా పూర్తయిన నెలల గ్యాప్లోనే చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా మరో సినిమాను ప్రకటించేశాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. సినిమా షూటింగ్ మాత్రం అక్టోబర్ నెల వరకు పూర్తయ్యే అవకాశం లేదట. అక్టోబర్లో షూటింగ్ పూర్తి చేసినా.. నవంబర్, డిసెంబర్, జనవరి ఏకంగా మూడు నెలలు ఈ సినిమా ప్రమోషన్స్ లో సందడి చేయనున్నడట. భారీ ఎత్తున సినిమాపై ఆడియన్స్లో హైప్ క్రియేట్ చేయడానికి అనిల్ రావిపూడి పగడ్బందీగా ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక అనిల్ సినిమా సక్సెస్ కు ఆయన ఎంచుకునే కథ సినిమా నాణ్యతతో పాటే ఆయన సినిమాకు చేస్తున్న ప్రమోషన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. తను తెరకెక్కించే ఏ సినిమా అయినా మినిమం 6 నెలల్లో పూర్తిచేసి మిగతా సమయాన్ని సినిమా రిలీజ్ వరకు ప్రమోషన్స్ కోసం చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఉంటాడు అనిల్. ఈ క్రమంలోనే స్టార్ట్ డైరెక్టర్ సైతం అనిల్ స్పీడ్ కు షాక్ అవుతున్నారు. ఇప్పటికైనా అనిల్ ప్రమోషన్స్ స్ట్రాటజీని చూసి ఇతర దర్శకులు ఆయన నుంచి నేర్చుకోవాలంటూ నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.