‘ పెద్ది ‘ చరణ్‌కు కోచ్‌గా ఆ స్టార్ హీరో.. పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..!

టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచరణ్, బుచ్చిబాబు సన్న కాంబోలో తెర‌కెక్క‌నున్న లెటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ పెద్ది. ఇప్పటికే రిలీజైన‌ టైటిల్, గ్లింప్స్‌తో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తన స్టైల్లో బ్యాటింగ్ షాట్స్‌తో పెద్ది మార్క్‌ను చూపించాడు చరణ్. అయితే.. తాజాగా సినిమాకు సంబంధించిన మరో స్టార్ హీరో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. బర్త్డే సందర్భంగా ప్రతి సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందో రివీల్‌ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్లను పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే.. ఆయనకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ తన పాత్ర పేరు గౌర్నాయుడు అంటూ క్లారిటీ ఇచ్చారు.

ʀᴄꜰ_ɢᴀɴɪ | Peddi 💥🥵 • • #ramcharan #shivarajkumar #Peddi #follow  #instagram #rc #💥 #🥵 #firstlook #mass #4k #fire #rampage #goosebumps |  Instagram

పెద్ది సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శ‌ర‌వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు రోజులు షూట్‌ను పూర్తి చేసుకున్న శివరాజ్ కుమార్.. గతంలో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఆ రెండు రోజులు చాలా సరదాగా గడిచిపోయాయని.. తొలిసారి తెలుగులో మాట్లాడా.. డైరెక్టర్ చాలా మంచివాడు.. నా షాట్‌ను ఆయన ప్రశంసించాడు. రామ్ చరణ్ ప్రవర్తన చాలా బాగుంటుంది. సినిమాలో మొదటిసారి తెలుగులో డైలాగ్ చెప్పా.. పెద్దిలో నా రోల్ చాలా స్పెషల్ గా ఉంటుందంటూ వివ‌రించాడు.

బుచ్చిబాబు స్క్రిప్ట్ చాలా నచ్చి.. దీనికి వెంటనే ఒప్పుకున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక సినిమాలో చరణ్ కోచ్‌గా శివరాజ్ కుమార్ మెర‌వ‌నున్నాడట‌. వృద్ధి సినిమా బ్యానర్ పై.. వెంకట సతీష్ కిలారు నిర్మాతగా.. మైత్రి మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ స్యుక్తంగా నిర్మిస్తుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాల్లో.. శివరాజ్ కుమార్ తో పాటు.. జగపతిబాబు, దివ్యేందు శర్మ లాంటి స్టార్ సెలబ్రెటీస్ న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాకు.. ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్య‌వహ‌రిస్తున్నాడు. కాగా.. వచ్చే ఏడాది మార్చ్ 27న పెద్ది గ్రాండ్గా రిలీజ్ కానుంది.