రాజమౌళిని ఫాలో అవుతున్న సందీప్.. ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ట్ డైరెక్టర్స్ గా తమకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని రాణిస్తున్నారు. అలా అర్జున్ రెడ్డి సినిమాతో తనదైన మార్క్‌ క్రియేట్ చేసుకుని భారీ సక్సెస్ తో రికార్డులు క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా. తను ఇప్పటివరకు తెర‌కెక్కించింది మూడు సినిమాలు అయినా.. ఒక్కో సినిమాతో ఒక్కో సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న సందీప్.. తన ప్రతి సినిమాతోను బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాడు. ఇలాంటి సందర్భంలో.. ఇప్పుడు ఆయన ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

Sandeep Reddy Vanga Finally Reveals That Prabhas' Spirit Will Focus On A  Gripping Police Story; Watch - Entertainment

సినిమాతో మరోసారి బాక్సాఫీస్ బ్లాస్ట్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఆడియన్‌ను ఈ సినిమా ఆకట్టుకునేలా డిజైన్ చేస్తున్నడట సందీప్. ఇక.. దీనికోసం ప్ర‌భాస్‌ను పూర్తిగా తన క‌స్టడీలోకి తీసుకోవాలని చూస్తున్నాడట. ప్రస్తుతం సినిమా షూట్ పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి వంగకు సరెండర్ అవుతారని.. స్పిరిట్ సినిమా కోసం పూర్తి డేట్స్ తనకు కేటా ఇచ్చేస్తాడని టాక్‌ నడుస్తుంది. స్పిరిట్ సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. కానీ.. ఫౌజి డేట్స్ స్పిరిట్ సినిమాకు మధ్యలో అడ్జస్ట్ చేస్తే ఇబ్బంది అవుతుందని.. ఈ రెండు సినిమాలు ఫార్మిల్‌గా నడిపించడం కుదరదని తన సినిమాలో హీరో క్యారెక్టర్జేషన్ చాలా డిఫరెంట్గా లుక్.. మొత్తం పూర్తి భిన్నంగా ఉంటుందని.. ఫౌజి సినిమా పూర్తి అయ్యేవరకు నేను వెయిట్ చేస్తా అంటూ వివరించాడట.

SS Rajamouli Biography: Birth, Age, Family, Career, Movies, Net Worth &  More!

దానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక.. రాజమౌళి ఎప్పటినుంచో ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాడు. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ ను కస్టడీలోకి తీసుకున్న ఆయన.. తర్వాత ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ లను.. ఇప్పుడు మహేష్ బాబును ఇలాగే కస్టడీలో ఉంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సందీప్ రెడ్డివంగా కూడా స్పిరిట్ సినిమా కోసం ఇదే చేయాలని చూస్తున్నాడట. మరి సందీప్ ప్లాన్ పూర్తిగా వర్కౌట్ అవుతుందా.. ప్రభాస్ తన డేట్స్ను సందీప్ కు ఇచ్చేసి ఆయన దగ్గర సరెండర్ అవుతాడా లేదా.. వేచి చూడాలి.