సాయిబాబా వ్రతం నా లైఫ్‌ను ఛేంజ్ చేపింది.. ఉపాసన కొణిద‌ల

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ భార్య ఉపాసన కొణిద‌ల‌కు సైతం టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఉపాసన మొదటి నుంచి ఆధ్యాత్మికతపై చాలా నమ్మకంతో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోలో సాయిబాబా వ్రతం కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్నీ షేర్ చేసుకుంది. సాయిబాబా వ్రతం.. దానివల్ల తన లైఫ్ లో జరిగిన మార్పుల గురించి ఆమె చెప్పుకొచ్చింది. అత్త‌మ్మాస్ కిచెన్ బుక్ లో ఉన్న శ్లోకాలు చదువుతూ తన డివోషనల్ జర్నీని గుర్తుచేసుకుంది.

Upasana Kamineni Konidela | This Thursday is very special. I finished 9  weeks of #Saibaba vrat. I couldn't go to the temple & distribute books,  therefore created a... | Instagram

ప్రతి ఒక్కరికి ఇష్టదైవం ఉంటుంది.. అలా నా భర్తకు అయ్యప్ప అంటే, నాకు సాయిబాబా అంటే విశ్వాసం. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో తాత ,అమ్మమ్మ, నాన్న, అమ్మ అంతా దేవుడిపై చాలా భక్తితో ఉండేవాళ్ళు. వాళ్ళని చూసి నాకు ఆ విశ్వాసం కలిగింది. ఒకసారి లైఫ్ లో కష్టంగా ఉన్న టైంలో ఎటూ తెల్చుకోలేని టైంలో సాయిబాబా వ్రతం ఆచరించామని వాళ్ళు చెప్పారు. ఆ కథ చదవడం మొదలు పెట్టిన తర్వాతే నా లైఫ్ లోను మార్పులు మొదలయ్యాయి అంటూ ఉపాసన వివరించింది. నేను మెల్లిమెల్లిగా పాజిటివ్గా చేంజ్ అయ్యా.. నా చుట్టూ కూడా పాజిటివ్ గా అనిపించింది. వ్యక్తిత్వంలో చేసుకున్న మార్పులు చాలా గొప్పగా అనిపించాయి. అందుకే.. ఈ వ్రతం పై నాకు విశ్వాసం కలిగింది.

Upasana Konidela Opens Up About Her Spiritual Anchor Sai Baba Vrat | Upasana  Konidela Opens Up About Her Spiritual Anchor Sai Baba Vrat

జీవితంలో ఏదైనా అడ్డు ఎదురైతే.. ఏది సరిగ్గా జరగకుంటే.. వ్రతం లాంటి డివోషనల్ రూట్ ను ఎంచుకోవచ్చు. కారణం ఈ లోకంలో ఏ మందు చేయని పని.. నమ్మకం చేస్తుంది అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. డివోష‌న‌ల్ దారి అలవాటు చేసుకోవడం వల్ల మనిషిలో గొప్ప మార్పులు వస్తాయి. ఉపవాసాలు, వ్రతాలు మన మనసును శుభ్రం చేస్తాయి. నిజమైన నమ్మకంతో చేస్తే.. జీవితంలోనూ మార్పులు వచ్చేస్తాయి అంటూ ఉపాసన ఆ వీడియోలో డివోషనల్ ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసుకున్న ఈ వీడియో నెటింట తెగ వైరల్ గా మారుతుంది.