నేను నెపో కిడ్స్ రేంజ్‌కు ఎదుగుతున్నా.. విజయ్ దేవరకొండ

సినీ ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే స్టార్ బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వార‌సుల‌కు కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ కష్టపడి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోలుగా సక్సెస్ అవుతున్న వాళ్లకు అంత ఫ్రీడమ్ ఉండదు. ఏదైనా కథ విని నచ్చకపోతే నో అని చెప్పే ధైర్యం.. వార‌సుల‌కు ఉన్నంత ఫ్రీడం స్వయంకృషితో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోల‌కు అంత త్వ‌ర‌గా రాదు అన‌డంలో అతిశయోక్తి లేదు. అయితే తాజాగా ఈ అంశం పైనే విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడిప్పుడే ఈ విషయాలన్నిటిలో.. నేను కూడా ఆ రేంజ్‌కు ఎదుగుతున్నానంటూ వివరించాడు.

తనకు నచ్చని స్క్రిప్ట్ను ఓపెన్ గా నో చెప్పే స్వేచ్ఛ, చేయనని చెప్పే ధైర్యం తనకు వచ్చాయని.. ఇన్నాళ్లు ఆ ఫ్రీడం కోసం ఎంతగానో కష్టపడ్డా. ఉదాహరణకు.. పెద్ద ఫ్యామిలీ నుంచి బడ బ్యాక్గ్రౌండ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకుండా.. ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా వస్తే.. కథ‌ల‌కు నో చెప్పే అవకాశం ఉండదు. ఆ స్క్రిప్ట్‌తో షూటింగ్ చేయలేను. స్క్రిప్ట్ పై కాస్త వర్క్ చేసి.. మళ్లీ కనిపించమని ధైర్యంగా దర్శక, నిర్మాతలకు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. నాకు తెలిసినంతవరకు అలా స్క్రిప్ట్ పై తిరిగి వర్క్ చేయమని ఇండస్ట్రీలో చాలా కొంతమంది హీరోలు మాత్రమే చెబుతారు. వాళ్ళు ఈ విషయాన్ని ధైర్యంగా వెల్లడించడానికి కారణం వాళ్లకున్న బ్యాగ్రౌండ్ అని నేను భావిస్తా. వాళ్లకా సపోర్ట్ ఉంది. అవసరమైతే కొన్నేళ్లు గ్యాప్ తీసుకో.. నీకోసం ఇద్దరు ముగ్గురు రైటర్ ని నేను తీసుకొస్తా అని భరోసా ఇచ్చే తండ్రులు ఉన్నారు.

నాకు అలాంటి అవకాశం లేదు. అయినా.. ఇప్పుడిప్పుడే నేను ఆ ఛాన్స్ తీసుకుంటున్నా. నచ్చకుంటే చేయనని క్లారిటీగా చెప్తున్నా. ఆ రేంజ్‌కు మెల్లమెల్లగా ఎదుగుతున్నా. ఇప్పటికే నాకు కొంతమంది దర్శక నిర్మాతల నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చింది. అయినా.. నిర్ణయం మాత్రం నేనే తీసుకుంటున్నా అంటూ విజయ్ దేవరకొండ వివరించాడు. ఇక నాకు స్క్రీన్ పై స్పెషల్ పేర్లు ఏమీ అవసరం లేదని.. నన్ను నా పేరుతో ఒక హీరోగా గుర్తుంచుకుంటే చాలు.. ఎలాంటి ట్యాగ్స్ నేను ఆశించను. కానీ.. ఎంతకాలం నేను ఇలా ట్యాగ్ లేకుండా ఉండగలను నాకు కూడా తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.