క్రేజీ హీరో సిద్ధార్థ్‌కు.. టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అయన.. తర్వాత అలాంటి టైప్ కంటెంట్ ఎంచుకోవడంలో విఫలం అవుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ సైతం సిద్ధార్థ మరోసారి అలాంటి కంటెంట్ ఎంచుకొని సక్సెస్ కొడితే బాగుంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల ఒక్క సరైన హిట్ కూడా లేక సతమతమవుతున్న సిద్ధార్థ్.. తాజాగా నటించిన మూవీ 3BHK. ఈ సినిమా కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్ లో థియేటర్లలో రిలీజై మంచి టాక్ దక్కించుకుంది.
ముఖ్యంగా.. సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కూడా.. సిద్ధార్థ రోల్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుండడం విశేషం. ఇక సిద్ధార్ధ్ ఈ సినిమాలో చిన్నా పాత్రలో జీవించేసాడు. చిన్నా పాత్ర.. ఆయన లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ మూవీ కేవలం ఒక స్టోరీ కాదని.. అదొక ఆశా కిరణం అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మిడిల్ క్లాస్ అబ్బాయికి.. నిరంతరం ఎదురు దెబ్బలు తగులుతున్నా.. ప్రతి దాంట్లో అపజయాలు ఎదురవుతున్న.. వాటన్నింటినీ ఎలా ఎదురుకుంటాడు.. ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుంది.. మానసిక స్థితి.. తర్వాత ఆ పరిస్థితులను అధిగమించడానికి అతను ఏం చేస్తాడు.. అనే విషయాలను ఇంట్రెస్టింగ్ గా.. చాలా ఎమోషనల్ గా తెరకెక్కించాడు డైరెక్టర్.
ఇక ప్రతి మనిషికి.. ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది అనే ఆశ చిగురింప చేస్తే స్టోరీనే ఈ మూవీ. ఇక సాధారణ జనానికి నిత్యం ఎదురయ్యే కొన్ని సంఘటనలు, సమస్యలు.. ఈ సినిమాలో డైరెక్టర్ కళ్ళకు కట్టినట్లు చూపించాడని తెలుస్తుంది. అయితే.. సినిమాపై కొంచెం నెగిటివిటీ ఉన్నా.. ఎమోషనల్ సీన్స్‌లో సిద్ధార్థ మెప్పించాడని.. మిగతా నటినట్లు కూడా తమ టాలెంట్‌తో ఆకట్టుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే అని.. ఓవరాల్ గా సినిమా థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేసేలా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఒక అదిరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కుర్రాడికి సినిమా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని.. ఫీల్ గుడ్ ఎమోషనల్ సెంటిమెంట్ స్టోరీ అంటూ విశ్లేషిస్తున్నారు. మొత్తానికి సిద్ధార్థ చాలా కాలం తర్వాత ఒక్క సరేలే హిట్ అందుకోబోతున్నాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో వేచి చూడాలి.