టాలీవుడ్ కింగ్ నాగార్జున గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దానికి ప్రధాన కారణం కుబేర. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున ఓ ప్రధాన పాత్రలో మెరిసారు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌లో టాప్ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోయిన నాగార్జున.. ఒక నెగిటివ్ షెడ్ పాత్రలో నటించడం ఫ్యాన్స్‌కు కాస్త షాక్‌ను కలిగించినా.. సినిమాలో ఆయనను చూసిన తర్వాత ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్కినేని ఫాన్స్ నాగార్జున రోల్‌ను.. ఆయన వైవిధ్యమైన నటనను తెగ ఎంజాయ్ చేశారు.
ఇలాంటి క్రమంలోని నాగార్జున తాజాగా మరో టాలీవుడ్ సినిమాలో విలన్ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది. కుబేర సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించే నాగ్.. డేరింగ్ స్టెప్ తీసుకుని.. నాగ్ తన నటనతో పాజిటివ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. మరి మరోసారి విలన్ షేడ్స్ లో ఓ తెలుగు హీరోతో తలపడేందుకు సిద్ధమవుతున్నాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. వాటి వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమాలో విలన్ షేడ్స్‌లో ఓ సెంటిమెంట్ పాత్ర కోసం సెర్చింగ్ లో మొదలుపెట్టారట టీం.
అయితే.. మొదట ఈ పాత్ర కోసం ఆది పిన్నిశెట్టిని అనుకున్నా.. కుబేర చూసిన తర్వాత ఈ సినిమాలో నాగార్జున అయితే పర్ఫెక్ట్ గా ఉంటాడని భావించిన మేకర్స్.. ఈ పాత్రలో ఆయనను నటింపజేయాలని ఫిక్స్ అయ్యారట. పాత్రలో చిన్న మార్పులు చేర్పులు చేసి నాగార్జునను తీసుకోవాలని సుకుమార్ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోని సుక్కు.. నాగార్జునకు కూడా స్టోరీ వినిపించాడట. ఆయన కూడా పాజిటివ్గా రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ నాగార్జున ఒప్పుకుంటే మాత్రం.. ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. చరణ్ సినిమా నెగటివ్ పాత్రలో నాగార్జున నటించడం అంటే.. ఫ్యాన్స్‌లోనెక్సట్ లెవెల్ హైప్ నెలకొంటుంది.