టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కాంభో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరి కాంబోలో గతంలో నాలుగు ఐదు సినిమాలు తెరకెక్కి.. ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఎస్పీ పరశురాం, మోసగాడు, రాణికాసుల రంగమ్మ, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట.. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతో సునామీ సృష్టించారు. ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఓ పక్కన తెలుగు రాష్ట్రాల్లో తుఫాను విజృంభించగా.. మరోవైపు దియేటర్లలో ఈ మూవీ తుఫాను సృష్టించింది. తెలుగు సినిమాల్లో ఇది ఎవర్గ్రీన్ క్లాసికల్ గా నిలిచింది.
ఈ సినిమా సక్సెస్‌తో వీళ్ళిద్దరూ కలిసి మరో సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. యాక్షన్ అడ్వెంచర్స్ కథలని సిద్ధం చేసుకుని సినిమాలు ప్రారంభించారు. దానికి కోదండరామిరెడ్డి డైరెక్టర్గా వ్యవహరించగా.. చెన్నై స్టూడియోస్ లో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమాకు ఎంజిఆర్ స్పెషల్ గెస్ట్‌గా హాజరై క్లాప్ కొట్టారు. అదే వజ్రాల దొంగ మూవీ. ఈ మూవీతో శ్రీదేవి ప్రొడ్యూసర్ గా మారింది. తన చెల్లి శ్రీలత పేరుతో లతా ప్రొడక్షన్స్ బ్యాలెన్స్ స్థాపించి వజ్రాలదొంగ సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించింది. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ కూడారూపొందించారు.
దానికోసం చెన్నైలో ఓ సెట్ కూడా గ్రాండ్గా వేసి సాంగ్ షూటింగ్ అయిన తర్వాత సినిమా ఆగిపోయింది. కారణం సినిమాపై భారీ హైప్ పెరగడం. బయ్యర్లు షూటింగ్ దశలోనే సినిమాలు కొనేందుకు ఎగబడటం.. హక్కుల కోసం పోటీ పడడం.. ఓ పక్క కథలో అంతా కంటెంట్ కనిపించడం లేదు. దీంతో.. డైరెక్టర్ కోదండ రామిరెడ్డి.. శ్రీదేవితో విషయాన్ని చెప్పాడు. దీంతో తర్వాత మరో సబ్జెక్టుతో సినిమా చేద్దాం అనుకున్నారు.. అదే మిస్టర్ ఇండియా రీమేక్. కానీ.. చిరంజీవికి కథ నచ్చలేదు. అలా కొంతకాలం కథల కోసం వేచి చూసిన.. జగదీక వీరుడు అతిలోకసుందరి సినిమాను మించిపోయే రేంజ్‌లో కథ మాత్రం దొరకకపోవడంతో ఆపేశారు. అలా శ్రీదేవి నిర్మాతగా వ్యవహరించిన చిరంజీవి సినిమా.. తెరపైకి రాకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ శ్రీదేవి ప్రొడ్యూసర్గా చేయాలనీ ఆలోచన కూడా చేయలేదు.