టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు తాజాగా కన్నప్ప సినిమాతో ఆడియన్స్‌ను పలకరించి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజై.. మొదటి రోజు నుంచి అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఇక కొన్ని రోజుల క్రితం విష్ణు సినిమా ఓటీటీ డీల్స్ గురించి ప్రస్తావిస్తూ.. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ డీల్ కుదుర్చుకోవడానికే నా దగ్గరకు వచ్చారు.. సినిమాకు వాళ్ళు పెడతామన్న రేట్ నాకు నచ్చలేదు.
సినిమా రిలీజై బ్లాక్ పాస్టర్ అయితే ఎంత ఇస్తారు అని అడిగా. దాంతో వాళ్ళు ఇంత కలెక్ట్ చేస్తే ఈ అమౌంట్ ఇస్తామంటూ రేట్ చెప్పారు. ఆ ఫిగర్ నాకు బాగా నచ్చేసింది. దీంతో సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్స్ పూర్తయ్యాక మళ్లీ కలుద్దామని వాళ్లకు చెప్పా అంటూ విష్ణు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు అందుకే సినిమాకు ఓటీటీ డీల్ కంప్లీట్ కాలేదు. కాగా ఇలాంటి క్రమంలో తాజాగా సినిమా నార్త్ శాటిలైట్ డీల్ మాత్రం క్లోజ్ అయినట్లు సమాచారం.
ఇక ఈ సినిమా హిందీ హక్కులను బాలీవుడ్ ప్రముఖ సంస్థ రికార్డ్ బ్రేకింగ్ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఒక తెలుగు సినిమా హిందీ శాటిలైట్ హక్కులు ఏకంగా రూ.20 కోట్ల రేంజ్‌లో అమ్ముడుపోయాయి అంటే అది సాధారణ విషయం కాదనే చెప్పాలి. దీంతో.. విష్ణు జాక్పాట్ కొట్టినట్లు అయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తుంది. ఇక.. సినిమా ఫుల్ రన్‌లో ఏ రేంజ్‌లో కలెక్షన్స్ కొల్లగొడుతుందో వేచి చూడాలి.