టాలీవుడ్ మెగాస్టార్ చిరు..పేరు చెప్పగానే డ్యాన్స్‌తో పాటు.. ఆయన కామెడీ టైమింగ్ కచ్చితంగా గుర్తొచ్చేస్తూ ఉంటుంది. చిరంజీవి కామెడీ టైమింగ్ తో అదరగొట్టి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు.. ఆయన కామెడీ టైమింగ్‌కు ఓ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే వింటేజ్ చిరుని మళ్లీ వెండితెరపై చూడాలని ఎప్పటినుంచో చిరు అభిమానులు ఆశగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కామెడీని ఎంజాయ్ చేయాలని ఎంతగానో ఆరాటపడుతున్నారు చిరు. ఇప్పటివరకు ఒకటి, అర సినిమాల్లో తన కామెడీ టైమింగ్ చూపించిన ఫ్యాన్స్‌కి అది అసలు సరిపడలేదు. వాళ్ళు అంతకుమించే రేంజ్ కామెడీని చిరు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అసలు సిసలు వింటేజ్ చిరంజీవి కామెడీని చూపిస్తానంటూ.. అనిల్ రావిపూడి ఆడియన్స్‌లో హైప్ పెంచాడు. చిరు తన 157వ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేలా టీం ప్లాన్స్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే ఆడియన్స్ లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక చిరు అసలు పేరు శివ శంకర వరప్రసాద్ అన్న సంగతి తెలిసిందే. ఈ పేరుతోనే సినిమాలో కనిపించనున్నాడు. డ్రిల్ మాస్టర్ శివశంకర వరప్రసాద్ గా సందడి చేయనున్న చిరు.. స్కూల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలో కామెడీ సీన్స్ తో ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించనున్నాడట.
ఇక అనిల్ గత సినిమా సంక్రాంతికి వస్తున్నాంలో బుల్లిరాజు అలియాస్ మాస్టర్ రేవంత్ ఆడియన్స్‌ను ఎంతలా ఎంట్రటైన్ చేశాడో తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ కోసం కూడా మరోసారి బుల్లి రాజును రంగంలోకి దించనునట్లు సమాచారం. రేవంత్ – చిరుమధ్య వచ్చే కామెడీ సీన్స్ పీక్స్ లెవెల్లో ఉండనున్నయట. జెట్ స్పీడ్‌లో ముసేలిలో ఈ సినిమా షూట్ జరుపుతున్నారు టీం. ఇక ఈ స్కెడ్యూల్లో చిరంజీవితో పాటు ఇద్దరు హీరోయిన్లు నయనతార, కేథరిన్ రచ్చ చేయనున్నారు. ఈ స్కూల్ ఎపిసోడ్ ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్ లో ఎంటర్టైన్ చేస్తాయని.. అవుట్ ఫుట్ తో మూవీ టీం ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.