టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపి డిప్యూటీ సీఎం గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరోపక్క తను సైన్ చేసిన సినిమాలను సైతం పూర్తి చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అలా పవన్ లైనప్‌లో ఉన్న సినిమాలన్నింటిలో అభిమానులంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి అనడంలో అతిశయోక్తి లేదు. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. మరో వంద రోజుల్లో గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు కేవలం ఒక గ్లింప్స్ వీడియో మాత్రమే రిలీజ్ అయినా.. సినిమాపై హైట్ మాత్రం పీక్స్ లెవెల్‌లో ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.
కేవలం సింగిల్ గ్లింప్స్‌తో ఈ రేంజ్‌లో అంచనాలు ఏర్పడతాయా అంటే.. పవన్ నుంచి ఫ్యాన్స్ ఆశించే రేంజ్‌లో ఎలివేషన్స్ గ్లింప్స్ పడితే మరి ఆ మాత్రం హైప్ ఉండదా అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 25న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ థియేట్రికల్ బిజినెస్లు దాదాపు అన్ని ప్రాంతాల్లో క్లోజ్ అవ్వడం విశేషం. ట్రేడ్ పండితులు చెబుతున్న సమాచారం ప్రకారం.. కేవలం ఒక్క కోస్తా ఆంధ్రాలోనే సినిమాకు రూ.81 కోట్ల బిజినెస్ జరిగిందట. ఇప్పటివరకు పీన్ ఇండియన్ ప్రాజెక్టులో ఆర్‌ఆర్ఆర్, పుష్ప 2 సినిమాలకు మినహా ఏ సినిమాకు ఈ రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ జరగలేదని.. సీడెడ్‌లో ఏకంగా రూ.25 కోట్ల బిజినెస్ జరిగిందని.. నైజాం కు 90 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం.
అలా కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఓవరాల్గా రూ.196 కోట్ల థియెట్రికల్ బిజినెస్ జరగడం సాధారణ విషయం కాదు. ఇప్పటివరకు.. రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా రూ.192 కోట్ల బిజినెస్ జరిగితే.. సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న పుష్ప 2కి రూ.220 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలాంటి క్రమంలో పుష్ప 2 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా పవన్ కళ్యాణ్ ఓజి రికార్డులు క్రియేట్ చేస్తుంది. రిలీజ్ ముందే డబ్బల్ సెంచరీ లెవెల్లో బిజినెస్ జరిగిందంటే.. రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే సినిమాకు నెక్స్ట్ లెవెల్ కలెక్షన్లు వస్తాయి అనడంలో సందేహం లేదు.