కన్నప్ప టిీంపై సీరియస్ అయినా హైకోర్ట్.. కీలక ఆదేశాలు జారి..!

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంయుక్తంగా తెర‌కెక్కించిన ప్రతిష్టాత్మక మూవీ క‌న్న‌ప్ప‌. ఈ సినిమా కోసం వీళ్ళిద్దరూ ఎంతగానో రిస్క్‌ చేశారు. కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని స్ట్రాంగ్ నమ్మకంతో ఉన్నారు. ఇలాంటి క్రమంలో సినిమా వివాదాస్పదంగా మారింది. సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలు, బ్రాహ్మణులను కించపరిచేల సినిమా నిర్మించారని.. బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు సిరిపుర‌పు శ్రీధర్ శర్మ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకు రీట్ పిటిషన్ను దాఖల చేశాడు. వేసవి సెలవుల అనంతరం తిరిగి ప్రారంభమైన ఈ హైకోర్ట్‌.. జూన్ 17 మంగళవారం కేస్ ను విచారణకు ప్రారంభంకాగా.. కోర్టులో ఈ వ్యవహారం పై తీవ్ర‌ చర్చలు జరిగాయి.

ఇలాంటి నేప‌ద్యంలో క‌న్న‌ప్ప టీం ఇంకా.. సెన్సార్ స‌ర్టిఫికెట్‌ రాకముందే గుంటూరులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అంతేకాదు.. ఈ ఈవెంట్‌లో ఎన్ని అవరాధాలు వచ్చినా జూన్ 27న కన్నప్ప కచ్చితంగా రిలీజ్ చేస్తామని.. అనౌన్స్‌ చేశారు. ఇక ఈ ప్రకటనను పత్రికల్లో వచ్చిన వార్తలను.. సెంట్రల్ ఫిలిం సర్టిఫికేషన్ బోర్డ్‌ తరఫున హాజరైన అడ్వకేట్.. కోర్టుకు ఆధారాలతో చూపించాడు. ఈ క్రమంలోనే హైకోర్టు కన్నప్ప టీంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంకా సెన్సార్ స్క్రుటీని జరగక ముందే.. రిలీజ్ డేట్ ను ఎలా ప్రకటించారని కోర్ట్ ఆగ్ర‌హాం వ్యక్తం చేసింది. ప్రతివాదులైన సెన్సార్ బోర్డు.. ఇతరుల వైఖరి పై కోర్టు మండిపడింది.

మీరు కౌంటర్ ఇవ్వకపోతే.. నోటీసులు అందిన తర్వాత కూడా టీం హాజరు కాకపోతే.. అనుమతులు లేకుండా సినిమాను రిలీజ్ చేస్తే మాత్రం కోర్టు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చింది. అలాగే నెక్స్ట్ విచారణ సరిగ్గా జూన్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఇదే రోజున కన్నప్ప సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మూవీ టీం అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో.. ప్రస్తుతం సర్వత్ర ఆసక్తి నెలకొంది. సినిమా వివాదం ఇప్పటికీ హైకోర్టు ఆగ్రహంతో పాటు.. మూవీ రిలీజ్ ముందస్తు ప్రకటనలు అన్ని సినిమాను అంతకంతకు వివాదంలోకి నెట్టేసాయి. ఈ క్రమంలోనే జూన్ 27న సినిమా రిలీజ్‌పై హైకోర్టు తుది నిర్ణయం ఆధారపడి ఉంది.