టాలీవుడ్ మాటలమాంత్రికుడు త్రివిక్రమ్.. విక్టరీ వెంకటేష్ కాంబో మూవీని అఫీషియల్‌గా ప్రకటించాడు నాగ వంశీ. అంతేకాదు.. తారక్‌తో మరో సినిమా రూపొందించనున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చాడు. తన ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసిన నాగవంశీ.. త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు ప్రాజెక్టులు లాక్ అయ్యాయని.. అందులో మొదటి సినిమా వెంకీ మామతో.. నెక్స్ట్ మూవీ తారక్ అన్నతో ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు. మిగతా సినిమాలంటూ.. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ ఫేక్ వార్తలు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే నా సోషల్ మీడియా వేదికగా నేనే అప్డేట్ ప్రకటిస్తా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక త్రివిక్రమ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రచన శైలి.. గతంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చావు సినిమాల కథల్లో చూస్తూనే వచ్చాం.
ఈ సినిమాలకు రచయితగా వ్యవహరించిన త్రివిక్రమ్.. ఇప్పుడు వెంకీ సినిమాకు దర్శకుడుగాను పని చేయనున్నాడు. వీళ్లిద్దరు కాంబోలో వస్తున్న మొదటి సినిమా కావడంతో.. ఆడియన్స్‌లో ఇప్పటికే ఈ మూవీపై మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక త్రివిక్రమ్, తారక్ కాంబోలో అరవింద సమేత వీర రాఘవ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సైతం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు.. రెండోసారి మళ్లీ వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రూపొందుతుండడంతో.. ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో నాగవంశీ చేసిన తాజా పోస్ట్ ఎన్నో ప్రశ్నలకు దారితీసింది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీ మైథాలజికల్ ఫాంటసీ ఫిలింగా తెరకెక్కనుందని క్లారిటీ ఇచ్చిన నాగవంశీ.. కార్తికేయ స్వామి శ్లోకాన్ని షేర్ చేసుకున్నాడు.
అందులో స్కంద సేనని పదాన్ని హైలైట్ చేస్తూ వచ్చాడు. దీంతో త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీ అదే టైటిల్తో రూపొందుతుందనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. కావాలని.. నాగ వంశీ ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ హింట్ ఇచ్చాడని.. సినిమాలో కార్తికేయడుగా నటిస్తున్నాడని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. నాగ వంశీ ఒక అభిమానిగా ఈ విషయాన్ని పద్యం రూపంలో ముందే హింట్ ఇచ్చాడంటూ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు.. నాగ వంశీ ప్రాజెక్ట్‌పై మరిన్ని క్రేజీ విషయాలను రివిల్ చేస్తాడో వేచి చూడాలి.