టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సిఎంగా మారిన తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన సెట్స్‌లో పాల్గొనే సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తుది దశకు చేరుకున్న వీరమల్లు, అలాగే.. ఓజీ షూట్లను కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. హరిహర వీరమల్లు ఈ ఏడాది జూన్ 12న రిలీజ్ అవుతుందని మొదట మేకర్స్ ప్రకటించిన కారణాలతో.. ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే వాయిదాలపై వాయిదాలు పడుతూ 12 సార్లు పోస్ట్‌పోన్ అయిన ఈ సినిమా.. రిలీజ్ డేట్ పై ఫ్యాన్స్ నమ్మకాన్ని కోల్పోయారు. అయితే.. తాజాగా మరోసారి హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మరోసారి.. వీరమల్లు రిలీజ్ డేట్ కొలిక్కి వచ్చిందంటూ టాక్ నడుస్తుంది.
ఇంతకీ వీరమల్లు నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు.. అసలు మేటర్ ఏంటి.. ఒకసారి తెలుసుకుందాం. ఈ ఏడది జులై 18న రిలీజ్ డేట్ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ట్రైలర్ కట్ ఇప్పటికే సిద్ధం చేసిన మేకర్స్.. ఇందులోనే రిలీజ్ డేట్ ఇంక్లూడ్ చేసి రిలీజ్ చేయనున్నారని టాక్ నడుస్తుంది. నిజానికి ఈ నెలకరే.. మూవీ రిలీజ్ అవుతుందని వార్తలు వినిపించినా.. మంచు విష్ణు మాత్రం కన్నప్ప సినిమాను అసలు వాయిదా వేసే ఉద్దేశంలో లేరు. ఈ క్రమంలోనే.. రెండు భారీ సినిమాలు కావడంతో.. క్లాష్ వల్ల రెండు సినిమాలుకు ఇబ్బంది కలుగుతుందన్న కోణంలో చర్చలు జరిగాయట. దీంతో.. మార్కెట్ పై దృష్టి సారించిన మేకర్స్ జులై 18న మూవీ రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే వాస్తవం అయితే.. జులై 18న ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే మాత్రం.. సినిమా రిలీజ్‌కు చాలా సమయం ఉంటుంది.
నెల రోజుల సమయంలో సినిమాకు సంబంధించిన ప్రతి పనిని పూర్తిగా కంప్లీట్ చేసుకుని.. ప్రీ ప్లానింగ్‌తో ప్రమోషన్స్ చేసి ఆడియన్స్‌లో హైప్ తెచ్చే సమయం కూడా దొరుకుతుంది. ఇక.. ఈ సినిమా ప్రమోషన్స్ కు కచ్చితంగా వస్తానని నిర్మాత ఏ.ఏం. రత్నంకు పవన్ హామీ ఇచ్చారట. కేవలం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే కాదు.. ముఖ్యమైన ఇంటర్వ్యూలో ఏదైనా, స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో సైతం తాను చేయూతనిస్తానని.. హామీ ఇచ్చినట్లు టాక్ నడుస్తుంది. ఇది ఫ్యాన్స్ కు బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అనడం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను మరో వారం రోజుల్లో గ్రాండ్ లెవెల్లో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత.. స్టోరీ పై ఆడియన్స్‌లో మరింత క్లారిటీ వస్తుంది. ఈ ట్రైలర్ ఆడియన్స్‌ను ఆకట్టుకోగలిగితే.. కచ్చితంగా సినిమాకు విశేషమైన ఓపెనింగ్స్ వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.