ప్ర‌భాస్ ఫౌజిలో న‌టించ‌నున్న మ‌రో టాలీవుడ్‌ హీరో.. ఎవ‌రంటే..?

బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ రెబల్ స్టార్ గా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం అరడజనులకు పైగా సినిమాలతో బిజీగా గడిపేస్తున్న డార్లింగ్.. కెరీర్‌లో అన్ని.. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లోనే ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఫౌజి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో స్వతంత్రానికి ముందు కాలంలో సాగిన క‌థ‌గా రూపొంద‌నుంది. ఇక ప్రభాస్ ఓ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు టాక్.

Who is Imanvi? Prabhas' new leading lady in upcoming movie Fauji

హీరోయిన్గా ఇమాన్వి నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. నడుస్తున్న టాక్ ప్ర‌కారం.. ఈ సినిమాలో మరో హీరో కీలక పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ట‌. ఇప్పటికీ అయినా షూట్లో సైతం పాల్గొని సందడి చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. రాహుల్ రవిచంద్రన్. రహుల్ ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్రలో మెరవనున్నాడని స‌మాచారం. ఇక మైత్రి మూవీ మేకర్స్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు విశాల్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు.

Rahul Ravindran joins Prabhas-Hanu Raghavapudi's war drama 'Fauji'- Deets  inside | - Times of India

ఇప్పటికే మూడు సాంగ్స్‌కు ట్యూన్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్ సినిమా షూట్‌ పూర్తి చేశాడు. త్వరలోనే ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ ఆడియన్స్‌ను పలకరించనుంది. అంతేకాదు ప్రభాస్ ఫౌజి తర్వాత.. సందీప్ రెడ్డి వంగా సినిమా సెట్స్‌లో పాల్గొన‌నున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్.. కెరీర్‌లోనే ఎన్న‌డు లేనివిధంగా ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మరువనున్నాడు. హీరోయిన్గా బాలీవుడ్ యాక్టర్ త్రిప్తి దిమ్రి కనిపించనుంది.