టాలీవుడ్ నందమూరి నట సింహం పెద్ద కోపిస్ట్ అని ఎప్పుడు చూసినా అందరిపై అరుస్తూ ఉంటాడని.. ఈ క్రమంలోనే ఆయనకసలు స్నేహితులే ఉండారంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ.. అదంతా వాస్తవం కాదని.. బాలయ్యది చిన్న పిల్లలు మనస్తత్వం.. మనసులో ఏది ఉన్న పైకి కరాకండిగా చెప్పేస్తారు.. ముక్కుసూటి తత్వంతో ఎవరైనా తప్పు చేస్తే ఆయన కోపాన్ని ఇట్టే బయట పెట్టేస్తుంటాడని బాలయ్య సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఆయనది చాలా స్వచ్ఛమైన మనసని.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు.
కాగా.. ఇలాంటి క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎకటి వైరల్ గా మారుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో గాడ్ ఆఫ్ మసెస్గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న బాలయ్య.. రాజకీయాల్లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం బాలయ్య బోయపాటి డైరెక్షన్లో అఖండ 2 సినిమాతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక బాలయ్యతో ఎంతమంది దర్శకులు సినిమాలు తెరకెక్కించిన.. ఎంతమంది స్టార్ హీరోయిన్ నటించిన.. అయనతో కలిసి పని చేసే ప్రతి ఒక్కరు ఆయనను ఎంత గౌరవంగా పిలుస్తూ ఉంటారు. పేరు పెట్టి పిలిచే సాహసం ఎవరు చేయరు. అయితే.. కొంతమంది మాత్రం బాలకృష్ణను బాలయ్య బాబు అని పిలుచుకుంటూ ఉంటారు.
కానీ.. ఇండస్ట్రీలో ముద్దు పేర్లతో పిలిచే సెలబ్రిటీస్ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకడు. ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్.. బాలయ్యతో ఎంతో చదువుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే బాలయ్యను పూరి.. ” బాల ” అంటూ ముద్దుగా పిలుస్తాడట. అసలు మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో అలా ధైర్యం చేసి ఆయనను పిలిచే వాళ్లే ఉండరు. అంత డేర్‌గా కేవలం పూరి జగన్నాథ్ మాత్రమే పిలుస్తాడు. అంతేకాదు గతంలో బాలకృష్ణనే స్వయంగా తన కెరీర్లో ఎంతో మంది డైరెక్టర్లతో పని చేసిన.. పూరి జగన్నాథ్‌తో వచ్చిన ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుందంటూ పూరి పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ బాలయ్యకు మధ్యన ఉన్న స్ట్రాంగ్ బాండింగ్.. పూరి జగన్నాథ్ ఆయనను పిలిచే తీరు ఆడియన్స్‌లో తెగ వైరల్ గా మారుతుంది.