వీరమల్లు ప్రొడ్యూసర్ కు షాక్ ఇచ్చిన అమెజాన్.. అప్పటిలోగా రిలీజ్ చేయకపోతే అంతే సంగతి..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా మూవీ హరిహర వీరమల్లు. ప్రతిష్టాత్మక పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్ వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. అమెజాన్ ప్రొడ్యూసర్లకు షాకింగ్ కండిషన్లు విధించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మే 9, జూన్ 12 తేదీల్లో సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

Official: Hari Hara Veera Mallu's OTT partner - TeluguBulletin.com

అయితే.. రెండుసార్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓప్పందం కుదిరిన తర్వాత పోస్ట్ పన్‌ చేసుకోవడంతో.. స్ట్రీమింగ్ టైంలో కూడా స‌వరించుకుంటూ వచ్చింది. మూడోసారి మాత్రం ఇలాంటిది అసలు కుదరదని.. స్పష్టమైన అల్టిమేటం జారీ చేసినట్లు టాక్ నడుస్తుంది. జులై చివరి వారానికి సినిమా రిలీజ్ కాకపోతే ఓటీటీ డీల్‌ను రద్దు చేసుకుంటామంటూ ప్రొడ్యూసర్ కు షాక్ ఇచ్చిందట. లేదంటే.. ఒప్పందం చేసుకున్న అమౌంట్ తగ్గించి ఇస్తామని హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీరమల్లు ప్రొడ్యూసర్ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి క్రమంలో అమెజాన్ పెట్టిన కండిషన్ ప్రొడ్యూసర్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తుందట. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ ఏ.ఏం. రత్నం.. వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ పై తుది నిర్ణయం తీసుకునే దశలో ఆలోచనలు చేస్తున్నాడు. సినిమా జులైలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జూలై 18న‌ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నారట. ఇక సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా.. పవన్ హీరోయిన్ గా నిధి అగ‌ర్వాల్‌ నటించింది. ఈ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ.. ఇప్పటికే ఏకంగా 12 సార్లు వాయిదా పడటంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమెజాన్ జారీ చేసిన డెడ్లైన్ ప్రకారం.. సినిమా జులైలో థియేటర్లోకి కచ్చితంగా వస్తే బాగుంటుందని భావిస్తున్నారు.