టాలీవుడ్‌లో ఆ టాలెంట్ ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా నటించి మెప్పించగల ఎన్టీఆర్.. డైలాగ్ డెలివరీతోనే కాదు.. నటన, డ్యాన్స్ పర్ఫామెన్స్ తోను ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నాడు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరిలోనూ కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే ఓ స్పెషల్ టాలెంట్ ఉందంటూ అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Thief of Yama (2007) - IMDb

తారక్ మాత్రమే ఇప్పటి సినిమాల్లోనూ ఓ జానల్లో నటించి మెప్పించగలరని.. మరే హీరోలకు ఇది సాధ్యం కాదంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో పౌరాణిక పాత్రలో నటించగల సత్తా ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్ అట. అలా ఎన్టీఆర్ గతంలోనూ యమదొంగ సినిమాలో యముడి పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు టీం. అంతేకాదు.. ఎన్టీఆర్ నటిస్తున్నవార్‌ 2 సినిమా నుంచి కూడా రేపు ఒక రేంజ్‌ అప్డేట్ బయటకు రానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి తారక్‌ రోల్ విషయంలో ఎన్నో సందేహాలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

Jr NTR Hrithik Roshan War 2 Movie Latest Update

ఆ సందేహాలన్నింటిని పట్టా పంచెలు చేయడానికి వార్ 2 అప్డేట్ ఇవ్వనున్నారు టీం. వార్ 2 సినిమా.. తారక్ కెరీర్‌లో మొట్టమొదటి బాలీవుడ్ మూవీ. ఈ క్రమంలోనే ఇది ఆయన కెరీర్‌లో మెమొరబుల్ సినిమాగా ఉండబోతుంది. డైరెక్షన్‌లో భారీ లెవెల్ స్పై యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ప్రస్తుతం చేతినిండా వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్.. ప్ర‌శాంత్ నీల్‌ డైరెక్షన్‌లో మరో సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. దీంతోపాటూ దేవర 2 లైనప్‌లో ఉంది. అంతేకాదు కోలీవుడ్ డైరెక్టర్ దిలీప్ కుమార్‌తోను మరో సినిమాకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలా బిజీ బిజీగా వరుస సినిమాలతో గడిపేస్తున్న ఎన్టీఆర్.. తన ఫ్యూచర్ సినిమాలతో ఎలాంటి రిజ‌ల్ట్ అందుకుంటాడో వేచి చూడాలి.