స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల అక్కినేని వారసుడు నాగచైతన్యను ఈ అమ్మడు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక్కసారిగా శోభిత పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది. ఈ క్రమంలో అక్కినేని ఇంటికి కాబోయే కోడలిగా భారీ పాపులారిటీ దక్కించుకున్న శోభిత ధూళిపాళ్ల.. ప్రస్తుతం అంతర్జాతీయ అవార్డుల బరిలో తలపడుతుంది. శోభిత దూళిపాళ్ల నటించిన హిందీ వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్ అరుదైన గౌరవాన్ని దక్కించుకోవడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఎన్నో వెబ్ సిరీస్‌లతో అంతర్జాతీయ వేదికపై దినైట్ మేనేజర్ సిరీస్ తలపడబోతోంది. తాజాగా 52వ ఏమి అవార్డుల నామినేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో మన దేశం నుంచి ది నైట్ మేనేజర్ నామినేట్ కాగా.. ఏకంగా 14 క్యాటగిరీస్‌లో భారతదేశం నుంచి దీనిని నామినేట్ చేశారు. ఇలా ఏకంగా ఒక్క వెబ్ సిరీస్ 14 క్యాటగిరీలో నామినేట్ కావడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇక ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్, ఆర్ట్స్ అండ్ సైన్స్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది.
డ్రామా సిరీస్ క్యాటగిరిలో ప్రాన్స్, ఆస్ట్రేలియా, అర్జెంటీనాకు చెందిన సిరీస్‌లతో పాటు శోభిత నటించిన ఈ వెబ్ సిరీస్ కూడా తెలపడనుంది. అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ ఇందులో కీలకపాత్రలో నటించినా శోభితనే షో స్టాపర్ గా నిలిచింది. ఇక 2016 లో ఇదే పేరుతో వచ్చిన బ్రిటిష్ సిరీస్ కు ఇది ఇండియన్ వర్షన్‌లో రూపొందింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ హిందీతో పాటు.. తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక నవంబర్ 25 న న్యూయార్క్ లో ఈ అవార్డులో వేడుక గ్రాండ్ లెవెల్లో జరగనుంది. ఇక ఈ వేడుకలో అక్కినేని కోడలు సిరీస్ ఎన్ని అవార్డులను దక్కించుకుంటుందో.. ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుందో వేచి చూడాలి.