మూడు ప్రపంచాలు కనెక్టివిటీ తో ‘ కల్కి ‘ కథ నడుస్తోంది.. నాగ్ అశ్విన్..

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ సినిమా పై తాజాగా ఆసక్తికర విషయల‌ను వివరించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్‌.. మూడు వినూత్న ప్ర‌పంచాల క‌న‌క్ట్ చేస్తూ సాగ్ క‌థ ఈ కల్కి అంటూ చెప్పుకొచ్చాడు. ఆధ్యాంతం ఆసక్తి , సరికొత్త అనుభూతిని అందిస్తుంది అంటూ వివరించాడు. ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ ఆఫ్ కల్కి 2898 ఏడీ పేరుతో డైరెక్టర్ అశ్విన్ ఓ వీడియోను షేర్ చేసుకున్నాడు. ఇందులో కల్కి కథ‌, సారంశం అని చెప్సుకొచ్చాడు. కాశీ, కాంప్లెక్స్, శంభాలా అనే మూడు ప్రపంచాల నడుమ ఈ కథ నడుస్తుందంటూ వివరించాడు.

తను మాట్లాడుతూ గంగా నది ఒడ్డున ఉన్న కాశీ.. ప్రపంచంలోనే మొదటి నగరమని.. అనేక శాసనాల్లో వివరించారు. మన నాగరికత పుట్టుక కూడా ఇక్కడ నుంచే ప్రారంభమైందట అంటూ వెల్ల‌డించాడు. ఒకవేళ కాశీని మానవాళికి చివరినగరంగా అనుకుంటే ఎలా ఉంటుందన్న ఊహనుంచి ఈ కథ రాసుకోచ్చానని.. కాశీ పైన తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఓ నిర్మాణం ఉంటుందని.. దానిని కాంప్లెక్స్ అంటారు.. అదొక స్వర్గం లాంటిది అంటూ చెప్పుకొచ్చాడు. కాంప్లెక్స్ లో ఉండే వనరులను కాశీ ప్రజలకు అందకుండా కొందరు నియంత్రించే ప్రయత్నాలు చేస్తారని.. ఈ రెండు ప్రపంచాలతో పాటు శంభాలా అనే మరో ప్రపంచం ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు.

ఇది కల్కి కథకు కనెక్ట్ అయి ఉంటుందని.. ఇక్కడ నుంచే విష్ణువు చివరి అవతారం కల్కి ప్రారంభమవుతుందని.. ఈ మూడు ప్రపంచాల మధ్య కనెక్టివిటీ ఏమిటన్నదే కల్కి సినిమాలో ఆసక్తికరంగా చూపించామని.. నాగ్ అశ్విన్ వివరించాడు. అమితాబచ్చన్, కమల్, దీపిక పదుకొనే, దిశా పటాన్ని తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దాత్ రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.