అకిరా నందన్ ..ఈ పేరు సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది . పవన్ కళ్యాణ్ కొడుకుగా ఎప్పుడూ నిరంతరం సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ఈ పేరు పై చర్చలు జరుగుతూనే ఉంటాయి . కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం .. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పోస్టులో ఆయన ఓకే అవ్వడం .. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీలకు ఫిదా అవ్వడం హైలెట్గా మారింది .
మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కూడా ఆఖీరానందన్ ఆయన పక్కనే ఉండడం .. ఏ మీటింగ్ కి వెళ్తున్న ఎవర్ని కలవడానికి వెళ్తున్న.. అఖీరానందన్ ను కూడా తీసుకొని వెళ్లడం హైలైట్ గా మారింది . సోషల్ మీడియాలో అఖీరాకి సంబంధించిన మరికొన్ని ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా తమ్ముడు. ఈ సినిమా రీ రిలీజ్ అయింది .
ఈ సినిమా రీ రిలీజ్ లో సందడి చేశాడు పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . అకిరానందాన్ ని చూసి థియేటర్స్ లో జనాలు సందడి చేశారు. పవన్ కొడుకు అకీరా అంటూ తెగ అరుపులతో కేకలతో రచ్చ రంబోలా చేశారు. అకీరా కూడా సిగ్గుపడుతూ నవ్వుకుంటున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ కొడుకు అంటే ఈ విధంగానే ఉంటుంది అంటున్నారు జనాలు..!!