డార్లింగ్.. ఈ మధ్యకాలంలో టు నాటీ అయిపోతున్నాడు . ఎలా అంటే తన సినిమాల ప్రమోషన్ కోసం తన పర్సనల్ ఇష్యూస్ ని కూడా బాగా వాడేసుకుంటున్నారు. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా ప్రభాస్ పెళ్లి మ్యాటర్ ..మెన్నటికి మొన్న నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ప్రభాస్ ఒక్క పోస్ట్ పెట్టగానే సోషల్ మీడియా ఏ రేంజ్ లో షేక్ అయిపోయిందో మనకు తెలిసిందే.
కాగా ఆ తర్వాత అది మొత్తం కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకున్న పోస్ట్ అంటూ క్లారిటీకి వచ్చేసింది . రీసెంట్గా ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఈవెంట్ హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో ప్రభాస్ స్పీచ్ హైలెట్ గా మారింది. కాగా ప్రభాస్ మాట్లాడుతూ ..”మొదట మేకర్స్ ఈ షోని హోస్ట్ చేయడానికి ఒక హాట్ యాంకర్ అంటూ చెప్పగానే అమ్మాయిల హార్ట్స్ బ్రేక్ అయిపోయాయి అని ..వాళ్ళ హార్ట్స్ బ్రేక్ చేయకుండా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత అని.. అందుకే పెళ్లి చేసుకోవట్లేదు “అంటూ చాలా చాలా నాటిగా స్పందించారు .
అయితే డార్లింగ్ ఫాన్స్ మాత్రం డార్లింగ్ స్పీచ్ పై ఆయన మాట్లాడిన మాటలు పై టెన్షన్ పడుతున్నారు. డార్లింగ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇప్పట్లో పెళ్లి చేసుకునేటట్లు కనిపించడం లేదు అంటూ మాట్లాడుకుంటున్నారు . అయితే ప్రభాస్ ఏ ఉద్దేశంతో అలా చెప్పాడో తెలియదు కానీ జనాలు మాత్రం ప్రభాస్ పెళ్లి పై అశలు వదులుకునేసినట్లే తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ప్రభాస్ బాగా కష్ట పడ్డాడు రిజల్ట్ అటు ఇటు అయితే మాత్రం యవ్వారం తేడా పడిన్నట్లే..!!