గుట్టు చప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకున్న కాజల్.. నన్ను క్షమించండి అంటూ ట్వీట్…!

నటి కాజల్ పనుపతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ.. తమిళంలో మాత్రం సుపరిచితమే. కో, కథమ్ కథమ్ వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో అల్లు శిరీష్ డెబ్యూ సినిమా ” గౌరవం ” లో కీలకపాత్రలో నటించింది కాజల్.

ఇక అనంతరం 2008లో ఫేమస్ కొరియోగ్రాఫర్ అయిన శాండీ మాస్టర్ ను వివాహం చేసుకుంది. ఇక కొంతకాలం సేఫ్గానే సాగిన వీరి వివాహ దాంపత్యం కొన్ని అనివార్య సంఘటనలు చోటు కాగా.. 2012లో ఈ జంట విడాకులు తీసుకుంది. ఇక విడాకుల అనంతరం శాండీ మరో అమ్మాయిని వివాహం చేసుకోగా.. కాజల్ మాత్రం అప్పటికి ఇంకా రెండో పెళ్లి చేసుకోలేదు.

కానీ.. తాజాగా కాజల్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ” ఫైనల్ గా రెండో పెళ్లి చేసుకున్న. నన్ను క్షమించండి ఫ్రెండ్స్. అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా ” అంటూ పెళ్లి బట్టలలో ఉన్న ఫోటోని షేర్ చేసింది కాజల్. కానీ భర్తను మాత్రం రివీల్ చేయలేదు. ఇక దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమె నిజంగా రెండో పెళ్లి చేసుకుందాం? లేదా ఏదైనా మూవీలో సీనా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.