” మా పాపకి అవి కొనడానికి అమెరికా వెళ్తా “… మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్…!

టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు తనయురాలు మంచు లక్ష్మి మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఎప్పటికప్పుడు కుర్రాళ్ళకి హీట్ పుట్టిస్తూ ఉంటుంది. ఇక మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం దక్కడం లేదు. ఇక ప్రస్తుతం ముంబైలోనే స్థిరపడింది.

అయితే తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న మంచు లక్ష్మి.. తాను హైదరాబాద్ నుంచి ముంబై రావడానికి గల కారణాలను తెలిపింది. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ…” నా కూతురికి నేను ఏదైనా చేయాలి అనుకుంటే ఇదే కరెక్ట్ సమయం. అందుకే నేను ముంబై వచ్చి ఆమెకు కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తున్న. మా పాప చదువు కోసమే ముంబై వచ్చాను. హైదరాబాద్ నుంచి ముంబై పెద్దగా దూరం కాదు. ఒక గంటలో వెళ్లిపోవచ్చు.

కానీ నా కూతురు చదువు పూర్తయిన తర్వాత తిరిగి హైదరాబాద్ వస్తాను. నేను షూ లేదా సాక్స్ కొనాలంటే కచ్చితంగా అమెరికా వెళ్లినప్పుడే కొంటా. ప్రతి సంవత్సరం ఒక్కసారి అయినా అక్కడికి వెళ్తా. అప్పుడే నాకు కావాల్సినవి అన్నీ తెచ్చుకుంటాను. అలాగే మా నాన్న కోసం నగలు గిఫ్టుగా తీసుకొస్తాను. ఆయనకు నగలు అంటే చాలా ఇష్టం ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.