మన ఆయుర్వేదంలో ఎన్నో మొక్కలు హెర్బల్ మెడిసిన్ గా వాడుతారని తెలుసు. ఇలాంటి హెర్బల్ మెడిసిన్ చెట్లలో ఆకులు ఔషధాలుగా పని చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయోటిక్ లక్షణాలను కలిగి కొన్ని సమస్యలకు చెక్ పెట్టడానికి సహకరిస్తాయి. అయితే డయాబెటిస్‌ను తగ్గించడానికి ఏఏ ఆకులు ఉపయోగించవచ్చ ఒకసారి తెలుసుకుందాం.
డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి కాకరకాయలు మంచిదన్న విషయం చాలామందికి తెలుసు. అయితే కాకర ఆకులు కూడా బోలెడు బెనిఫిట్స్ ఇస్తాయని మీకు తెలుసా.. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు ఇంటర్నల్ డామేజ్ ను తగ్గించడానికి.. కొలెస్ట్రాల్, కొవ్వులు కరిగించడానికి కాకర ఆకుల జ్యూస్ ఎంతగానో సాయపడుతుంది.
మెంతికూర షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచడానికి బాగా తోడ్పడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు విటమిన్ సి, విటమిన్ ఏ కూడా ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి మెంతి బాగా ఉపయోగపడుతుంది.
ఇక వేప హెర్బల్ ట్రి అని అందరికీ తెలుసు. వేపలో ఉండే యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తాయి. ప్రతిరోజు పరగడుపున వేపాకులతో చేసిన కషాయం తాగితే ఎటువంటి ఇన్ఫెక్షన్లు దరి చేరవు.
మనం పోపులో వాడే కరివేపాకు కూడా శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్టార్చ్ ను గ్లూకోజ్‌గా మార్చడాని నివారిస్తాయి కాబట్టి షుగర్ పేషెంట్లు కరివేపాకు తింటే మేలు కలుగుతుంది.
తులసి హెర్బల్ ట్రీ అని చాలామందికి తెలుసు. ఇది హైపో గ్లైసమిక్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి దాని ద్వారా డయాబెటిస్ కంట్రోల్ ఉండడానికి సహకరిస్తుంది. తులసి ఆకలితో టీ లేదా పచ్చి ఆకులను తిన్న మంచి ఫలితం ఉంటుంది.
రావి ఉసిరి.. ఆకుల్లో ఉండే బయో ఆక్టివ్ కాంపౌండ్స్ రక్తంలో షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. డయాబెటిస్ పేషెంట్లకు ఇదొక మంచి వైద్యం. ఈ ఆకులు జ్యూస్ చేసుకుని తీసుకోవాలి.
మామిడి ఆకులో ఉండే మినరల్స్, బయో మైక్రోమాలిక్యుల్స్ టైప్ టు డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. వేడినీళ్లలో మామిడి ఆకులు వేసుకుని తాగొచ్చు.. లేదా మామిడి ఆకులకు జ్యూస్ చేసుకునైన తీసుకోవచ్చు.