సినిమా ఛాన్స్‌లు త‌గ్గిన‌.. కోట్లు సంపాదిస్తున్న‌ మిల్కి బ్యూటీ.. అంత ఆదాయం ఎలా వ‌స్తుందంటే..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాలు గ‌డుస్తున్న అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరు సరసన నటించి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. చివరిగా చిరంజీవి భోళా శంకర సినిమాలో.. రజనీకాంత్ జైలర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి భోళా శంకర్ సినిమా ఈమెకు నిరాశ మిగిల్చిన.. జైలర్ సినిమాతో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా నటించే స్పెషల్ సాంగ్స్‌కు ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

మొదట బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సౌత్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే ఇటీవల బాలీవుడ్లో బోల్డ్ వెబ్ సిరీస్లలో నటించి కుర్రాళ్ళను కవించిన ఈ బ్యూటీ ఇటీవల కొత్త సినిమాల్లో నటించకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ గురయ్యారు. తను మాత్రం సినిమా అవ‌కాశ‌ల గురించి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం తమిళంలో అరుణ్మ‌ణై 4 సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ మలియాళం, హిందీలోనూ పలు సినిమాల్లో నటిస్తుంది. ఇక‌ సినిమా అవకాశాలు తగ్గినా ఆదాయం అర్జించే విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు మిల్కీ బ్యూటీ.

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ లోను, ప‌లు వాణిజ్య సంస్థ‌లో బ్రాండ్ అంబాసిడర్ గాను కోట్ల సంపాదిస్తుంది. వీటితోపాటు పెళ్లిళ్లు ఇతరేతర వేడుకల్లో కూడా ఈమె డ్యాన్స్ చేస్తూ భారీగా డిమాండ్ చేస్తుంది. కాగా ప్రస్తుతం తమన్న నటిస్తున్న సినిమాల్లో ఏదైనా సక్సెస్ అందుకుంది అంటే కచ్చితంగా ఆమె మళ్ళీ మంచి కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయం అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల తాజాగా విజయ వర్మతో లవ్‌లో పడిన తమన్నా ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్తో క‌లిసి డేటింగ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.