పైన కనిపిస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ? సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దక్షిణాది నుంచి బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఫిట్నెస్ విషయంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ బ్యూటీ లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికైనా ఈమె ఎవరో గుర్తుపట్టారా..? ఎస్ ఆమె నయనతార. ఇన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన ఈ బ్యూటీ తమిళ్, కన్నడ, తెలుగు, మలయాళ సినిమాల్లో పాపులారిటీ దక్కించుకుంది.
ఇటీవల షారుక్ సరసన జవాన్‌లో నటించి పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకుంది. ఇక నయన్‌కి అక్కడ కూడా వరుస ఆఫర్‌లు క్యూ కడుతున్నట్లు సమాచారం. జవాన్ కి భారీగా రెమ్యూనరేషన్ అందుకున్న నయనతార కు ఇప్పుడు బీభత్సమైన క్రేజ్ ఉంది. 2003లో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టిన నయన్ మలయాళం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. మనసినక్కరే అనే సినిమాలో హీరోయిన్గా పరిచయమైన నయన్ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది.
తర్వాత తెలుగులో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈ బ్యూటి దక్షిణాదిలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించింది. ఈమె కన్నడ చిత్రం సూపర్ లోను నటించింది. ఇప్పుడు హిందీలోనూ రాణిస్తుంది. అయితే సినీ కెరీర్ లో ఇంత సక్సెస్ అందుకున్న నయనతార పర్సనల్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రేమ విషయంలో అనేకసార్లు దెబ్బతిన్న నయన్ చాలా కాలం పాటు డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉంది. గతేడాది జూన్ 9న విఘ్నేష్‌ను వివాహం చేసుకుంది. వీరికి కవల పిల్లలు ఉన్నారు.