ఆ హీరోయిన్ తో లవ్ కన్ఫామ్ చేసిన సిద్ధార్థ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

హీరో సిద్ధార్థ్ బాయ్స్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మంచి పాపులారిటీ వ‌చ్చింది. తర్వాత టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో న‌టించాడు. ఇక జెనీలియా – సిద్ధార్థ కాంబినేషన్లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా సూపర్ హిట్ కావడంతో సిద్ధార్ధ్‌ స్టార్ హీరోగా పేరు సంపాదొంచుకున్నాడు. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లో సడన్‌గా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో టాలీవుడ్ కి దూరమైన సిద్ధార్థ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఇటీవల టక్కరి మూవీ తో టాలీవుడ్ పలకరించిన సంగతి తెలిసిందే.

ఇక కోలీవుడ్ లో రిలీజ్ అయిన సిద్ధార్ధ్.. చీత మూవీ బారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా రెస్పాన్స్ ను స్వయంగా చూసేందుకు సిద్ధార్థ తో పాటు చీతా మూవీ టీం.. అలాగే హీరోయిన్ అధితిరావ్ కూడా పాల్గొన్నారు. ఇక ఇప్పుడు అదే సినిమాను తెలుగులో చిన్న పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. అయితే సిద్ధార్థ – అధితిరావ్ హైదారి మధ్యన ప్రేమ వ్యవహారం నడుస్తుందంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఇటీవల సిద్ధార్థ తో కలిసి థియేటర్లో సందడి చేసింది అధితి.

తాజాగా చిన్నా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించగా అందులో సిద్ధార్థ్ కొని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. రిపోర్టర్ రీసెంట్గా మీరు ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు అసలు కారణం ఏంటో చెప్పగలరా అంటూ అడిగాడు. దానికి సిద్ధార్థ్ స్పందిస్తూ నాకు ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం అనేది ఇష్టం ఉండదు. కానీ ప్రాణంగా ప్రేమించే వాళ్ళ కోసం ఇలాంటి పనులన్నీ చేయక తప్పడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఇది తెలిసిన ప్రతి ఒక్కరు అధితిరావ్‌ హైదారితో.. సిద్ధార్థ తన ప్రేమను కన్ఫామ్ చేశాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.